ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలను ఆదుకోవడంలో కేంద్రం వైఫల్యం

ABN, First Publish Date - 2020-10-29T08:47:48+05:30

కరోనా సమయంలో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలు ఉపాధి కోల్పోయారని, వారిని ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని సీపీఎం రాష్ట్ర కమిటీ నాయకుడు దడాల సుబ్బారావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెక్కలి/నరసన్నపేట రూరల్‌, అక్టోబరు 28: కరోనా సమయంలో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలు ఉపాధి కోల్పోయారని, వారిని ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని సీపీఎం రాష్ట్ర కమిటీ నాయకుడు దడాల సుబ్బారావు అన్నారు. బుధవారం టెక్కలి, నరసన్నపేటల్లో స్థానిక పార్టీ కార్యాల యాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ.. వ్యవ సాయ ఉత్పత్తులపై కార్పొరేట్‌ కంపెనీల పెత్తనానికి అవకాశం కల్పిస్తూ చట్టాలను చేయడం దారుణమన్నారు. విద్యుత్‌ చట్టాలకు సవరణలను చేసి సబ్సిడీలను ఎత్తివేసి పేదలు, రైతులపై పెనుభారం వేస్తోందన్నారు. కార్మిక చట్టాల్లో మార్పులు చేసి కార్మికులకు భద్రతలేకుండా చేస్తోందని విమర్శించారు.


కేంద్రంలోని బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ లేదని, దళితులపై దాడులకు పాల్పడు తున్నారన్నారు. ఇన్ని జరుగుతున్నా రాష్ట్రంలో వైసీపీ, టీడీపీలు వారిలో వారు విమర్శలు చేసుకొని జాతీయ స్థాయిలో బీజేపీకి మద్దతు తెలుపు తున్నా రన్నారు. విభజన హామీలు ఇప్పటికీ అమలు పర్చలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. జిల్లా కార్యదర్శి బవిరి కృష్ణమూర్తి మాట్లాడుతూ.. బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా  ప్రచార కార్య క్రమాలు చేపట్టాలని కోరారు. సమావేశంలో నాయకులు కొల్లి ఎల్లయ్య, నంబూరు షన్ముఖరావు, డివిజన్‌ నాయకులు హెచ్‌. ఈశ్వరరావు, పాలిన సాంబమూర్తి,  శ్రీకాకుళం నగర సీపీఎం కార్యదర్శి టి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-29T08:47:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising