ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లిబియాలో అదృశ్యమైన యువకులు క్షేమం?

ABN, First Publish Date - 2020-10-03T10:26:38+05:30

లిబియాలో అదృశ్యమైన సీతానగరానికి చెందిన బత్సల జోగారావు, బత్సల వెంకటరావు, బొడ్డు దానయ్య క్షేమంగా ఉన్నట్లు లిబియా కంపెనీ వారి ఫొటోలను కుటుంబ సభ్యులకు వాట్సాప్‌ ద్వారా పంపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫొటోలు పంపిన కంపెనీ యాజమాన్యం 


సంతబొమ్మాళి, అక్టోబరు 2: లిబియాలో అదృశ్యమైన సీతానగరానికి చెందిన బత్సల జోగారావు, బత్సల వెంకటరావు, బొడ్డు దానయ్య క్షేమంగా ఉన్నట్లు లిబియా కంపెనీ వారి ఫొటోలను కుటుంబ సభ్యులకు వాట్సాప్‌ ద్వారా పంపింది. ఢిల్లీలోని సంబంధిత కంపెనీ ప్రతినిధి ఈ ఫొటోలను పంపించారు. అయితే వారి ఫొటోలు మాత్రమే పంపారని, వారి యోగక్షేమాలు తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 


గత నెల 14న లిబియా నుంచి ఇండియా వచ్చేందుకు బయలుదేరిన ముగ్గురు యువకులు ట్రిపోలి విమానాశ్రయం వస్తుండగా వారి ఆచూకీ కనిపించకుండా పోయారు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతుండగా  గురువారం రాత్రి వారు క్షేమంగా ఉన్నారని ఫొటోలు మాత్రమే పంపారని, వారితో కనీసం మాట్లాడించలేదని, దీంతో వారు ఎక్కడ ఉన్నదీ తెలియకపోవడంతో  వారు కిడ్నాప్‌నకు గురయ్యారే మోమని కుటుంబసభ్యుల్లో అందోళన నెలకొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమ కుటుంబ సభ్యులను స్వదేశానికి క్షేమంగా రప్పించాలని వారు కోరుతున్నారు. 

Updated Date - 2020-10-03T10:26:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising