ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మడ్డువలసకు జలకళ

ABN, First Publish Date - 2020-10-01T11:13:28+05:30

మడ్డువలస రిజర్వాయర్‌ నీటితో కళకళలాడుతోంది. జిల్లాతో పాటు ఒడిశాలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వేగావతి, సువర్ణముఖి నదుల్లో జల ప్రవాహం పెరిగింది. దీంతో మడ్డువలస రిజర్వాయర్‌ నీటిమట్టం గణనీయంగా పెరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మూడు గేట్ల ద్వారా నీరు విడుదల


వంగర, సెప్టెంబరు 30 : మడ్డువలస రిజర్వాయర్‌ నీటితో కళకళలాడుతోంది. జిల్లాతో పాటు ఒడిశాలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వేగావతి, సువర్ణముఖి నదుల్లో జల ప్రవాహం పెరిగింది. దీంతో మడ్డువలస రిజర్వాయర్‌ నీటిమట్టం గణనీయంగా పెరిగింది. రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 65.00 మీటర్లు. బుధవారం సాయంత్రానికి నీటిమట్టం 64.68కి చేరింది.


దీంతో అధికారులు అప్రమత్తమై..  మూడు ప్రధాన గేట్ల నుంచి నీటిని నాగావళికి విడుదల చేశారు. రెండు నదుల ద్వారా ఇన్‌ఫ్లో 3595  క్యూసెక్కులు రాగా, నదుల్లో ప్రవాహం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో 3,790 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెడుతున్నట్లు ఏఈ గణేష్‌ తెలిపారు. ఖరీప్‌ పంటలకు అదనంగా మరో 500 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నట్టు వివరించారు. వరద ఉధృతి పెరిగితే అదనంగా మరికొన్ని గేట్లు తెరిచి.. నీటిని నదిలోకి విడుదల చేస్తామని తెలిపారు. 

Updated Date - 2020-10-01T11:13:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising