ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలి

ABN, First Publish Date - 2020-12-14T05:08:01+05:30

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలని ఎంపీ రామ్మోహన్‌నాయుడు పిలుపునిచ్చారు. డొంకూరులో ఇటీవలే ప్రతిష్ఠించిన డొంకనీలమ్మ ఆలయాన్ని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌తో కలిసి ఆదివారం దర్శించుకున్నారు.

అమ్మవారిని దర్శించుకుంటున్న ఎంపీ రామ్మోహన్‌, ఎమ్మెల్యే అశోక్
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


  ఎంపీ రామ్మోహన్‌నాయుడు

ఇచ్ఛాపురం రూరల్‌, డిసెంబరు 13: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలని  ఎంపీ రామ్మోహన్‌నాయుడు పిలుపునిచ్చారు. డొంకూరులో ఇటీవలే ప్రతిష్ఠించిన డొంకనీలమ్మ ఆలయాన్ని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌తో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్‌లో టీడీపీకి మంచి రోజులు వస్తాయని తెలిపారు. డొంకూరు గ్రామస్థులు ఉప్పుటేరుపై ఉన్న బ్రిడ్జి శిథిలావస్థకు చేరిందని, తుఫాన్‌ రక్షిత భవనం నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపో యిందని,  రైతుల భూములు వెబ్‌ల్యాండ్‌లో లేకపోవడంతో ఇబ్బందిపడుతున్నారని  ఎంపీకి వివరించారు. ఈ సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ డి.ఢిల్లీరావు, మాజీ ఏఎంసీ మాజీ చైర్మన్‌ సాడి సహదేవు, డి.శ్రీను పాల్గొన్నారు.


రాయితీపై పంపిణీ చేసిన డిజిల్‌ను కొందరు దుర్వినియోగానికి పాల్పడడంతో వారిపై చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని కపాసుకుద్ధికి చెందిన మత్స్యకారులు బి.గురుమూర్తి, డి.ఢిల్లేసు, బి.సందయ్య, లోహిదాసులు కోరారు.ఈ మేరకు  డొంకూరులో ఎంపీ రామ్మోహన్‌ నాయుడుకు వినతిపత్రం అందజేశారు. ఈ విషయంపై ఇప్పటికే జేడీ  దర్యాప్తు ప్రారంభించారని ఎంపీ తెలిపారు. కలెక్టర్‌ను కలసి సమస్యను వివరించి  న్యాయం జరిగే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. 

 

Updated Date - 2020-12-14T05:08:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising