మాస్కులు ధరిస్తేనే సరుకులు విక్రయించండి
ABN, First Publish Date - 2020-06-18T11:19:24+05:30
మాస్కులు ధరించి వచ్చిన వారికే వ్యా పారులు సరుకులు విక్రయించాలని ఎంపీడీవో పి.మురళీమోహన్‌కుమార్ తెలిపారు. బుధవారం మండల పరిషత్ సమావేశ
సరుబుజ్జిలి: మాస్కులు ధరించి వచ్చిన వారికే వ్యా పారులు సరుకులు విక్రయించాలని ఎంపీడీవో పి.మురళీమోహన్‌కుమార్ తెలిపారు. బుధవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో వ్యాపారులతో సమావేశాన్ని ఏర్పా టు చేశారు. కార్యక్రమంలో పంచాయతీ విస్తరణాధికారి దామోదరరావు, పంచాయతీ కార్యదర్శి అనిల్ పాల్గొన్నారు.
పాలకొండ రూరల్: ప్రజలంతా తప్పనిసరిగా ధరిం చాలని నగర పంచాయతీ కమిషనర్ ఈ.లిల్లీపుష్పనాధం, ఎస్‌ఐ జనార్దనరావు తెలిపారు. బుధవారం పట్టణంలో వీరఘట్టం జంక్షన్, కోటదుర్గమ్మ ఆలయం, ఆర్టీసీ కాంప్లెక్స్, ఏలాం జంక్షన్‌ల్లో ప్రజలకు మాస్కులు ధరించడంపై అవ గాహన కల్పించారు.
ఇచ్ఛాపురం: ప్రతీ వ్యాపారి తప్పనిసరిగా మాస్కులు ధరించాలని మునిసిపల్ కమిషనర్ లాలం రామలక్ష్మి తెలిపారు. బుధవారం ఇచ్ఛాపురంలోని సురంగిరాజా మైదానంలో ఏర్పాటుచేసిన కూరగాయల మార్కెట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చే వారికి మాస్కు ఉంటేనే అమ్మాలని ఆదేశించారు.
ఆమదాలవలస: సచివాలయ సిబ్బంది వార్డుల్లో బుధవారం పర్యటించి మాస్కులు లేకుండా తిరగరాదని ప్రజలకు అవగాహన కల్పించారు. మునిసిపల్ కమిషనర్ ఎం.రవిసుధాకర్ ఆదేశాల మేరకు మాస్కులు ధరించని వారిని గుర్తించి రూ.100 అపరాధ రుసుం వసూలు చేసి మూడు మాస్కులు అందించారు.
Updated Date - 2020-06-18T11:19:24+05:30 IST