ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదలందరికీ పథకాలు: స్పీకర్‌ సీతారాం

ABN, First Publish Date - 2020-09-23T11:08:27+05:30

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి పేదవానికి చేరాలన్న సంకల్పంతో సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు స్పీకర్‌ తమ్మినేని సీతారాం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పాలకొండ (బూర్జ), సెప్టెంబరు 22: ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి పేదవానికి చేరాలన్న  సంకల్పంతో సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు స్పీకర్‌ తమ్మినేని సీతారాం తెలిపారు. మంగళవారం బూర్జ మండలంలోని  పాలవలస, అల్లె నల్లో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్‌నెస్‌ సెంటర్లు, నాడు-నేడు పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు.30 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీకి రిజిస్టర్‌ చేస్తే, ప్రతిపక్షం కోర్టుకు వెళ్లి స్టే తెచ్చిందని ఆరోపించారు.


ఎమ్మెల్యేలు తమ పరిధిలోని రైతు భరోసా కేంద్రం, సచివాలయం పనితీరుపై సమీక్షించి సాయంత్రానికి ముఖ్యమంత్రి డాష్‌బోర్డు వద్ద నివేదికలు ఉండాలని ఆదేశించారని  చెప్పారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కండాపు గోవిందరావు, గుమ్మడి రాంబాబు, బెజ్జిపురపు రామారావు, జల్లు అప్పలనాయుడు, బలరాం, సింగుపురపు కోటేశ్వరరావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-23T11:08:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising