ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డబ్బులు ఇస్తానని చెప్పి... దారికాసి చంపేసి

ABN, First Publish Date - 2020-12-17T05:36:40+05:30

పల్లివూరు పంచాయతీ పరిధిలోని చినపల్లివూరుకు వివాహిత రచ్చ స్వాతి హత్య కేసును పోలీసులు చేఽధించారు.ఈ మేరకు నిందితుడు లింగూడు రామకృష్ణ అలియాస్‌ ఏసురాజును బుధవారం అరెస్టు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  వివాహిత హత్య కేసును చేధించిన పోలీసులు
వజ్రపుకొత్తూరు, డిసెంబరు 16:
పల్లివూరు పంచాయతీ పరిధిలోని చినపల్లివూరుకు వివాహిత రచ్చ స్వాతి హత్య కేసును పోలీసులు  చేఽధించారు.ఈ మేరకు నిందితుడు లింగూడు రామకృష్ణ అలియాస్‌ ఏసురాజును బుధవారం అరెస్టు చేశారు. ఎస్‌ఐ కూన గోవిందరావు కథనం మేరకు... చినపల్లివూరుకు చెందిన రచ్చస్వాతి జీడిపిక్కల బడ్డీలో పనిచేసుండేది. సంతబొమ్మాళి మండలం లోని సీతానగరం గ్రామానికి చెందిన ఏసురాజు చినపల్లివూరులో ఉన్న తన అక్క వద్దకు అప్పుడప్పుడు వస్తుండేవాడు. ఈ క్రమంలో స్వాతితో ఏసురాజుకు పరిచయం ఏర్పడింది. అయితే స్వాతి కుమారుడి ఆరోగ్యం బాగులేకపోవడంతో ఏసుదాసుకు కొంత నగదు అడిగింది. డబ్బులు ఇస్తానని చెప్పి ఈనెల 11వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ద్విచక్రవాహనంపై చినపల్లివూరు గ్రామా నికి చేరుకున్నాడు. స్వాతి బహిర్బూమికి వెళ్తున్న సమయంలో దారికాసి ఆమెతో డబ్బుల విషయంపై గొడవపడ్డాడు. దీంతో  ఏసురాజు ఆవేశంలో తాడుతో స్వాతి మెడ బిగించి పక్కనే ఉన్న గోడకు తలను గుద్దించి రాయితో తలపై బలంగా కొట్టగా స్వాతి కోమలోకి వెళ్లిపోయింది. స్వాతి  మృతిచెందిందని భా వించి ఆమె మెడలో ఉన్న మంగళసూత్రం, బంగారం చైన్‌, మొబైల్‌ ఫోన్‌ తీసుకొని ఏసురాజు పరార య్యాడు. ఎంతకీ స్వాతి ఇంటికి రాకపోవడంతో ఆమె అత్త నీలవేణి గ్రామస్థుల సహకారంతో గాలించారు.   తోటలో పడిఉన్న స్వాతిని 108లో పలాస తరలించా రు. పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందింది. ఈ మేరకు దర్యాప్తుచేసిన పోలీసులు  ఏసురాజును అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను ప్రశ్నించగా స్వాతిని చంపినట్లు అంగీకరించాడు.  స్వాతికి చెందిన బంగారం ఆభరణాలతోపాటు ఏసురాజు  ఉపయోగిం చిన ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.  


Updated Date - 2020-12-17T05:36:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising