ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హామీలకే పరిమితమా?

ABN, First Publish Date - 2020-07-11T11:34:50+05:30

జిల్లాలో ఇచ్ఛాపురం మండలం డొంకూరు నుంచి రణస్థలం మండలం దోనిపేట వరకు సుమారు 193 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం ఉంది. ఇచ్ఛాపురం,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏర్పాటుకు నోచుకోని ఫిషింగ్‌ కోల్డ్డ్‌స్టోరేజ్‌

మాటలకే పరిమితమవుతున్న పాలకులు

మత్స్యకారుల ఆశలపై నీళ్లు


(టెక్కలి): జిల్లాలో ఇచ్ఛాపురం మండలం డొంకూరు నుంచి రణస్థలం మండలం దోనిపేట వరకు సుమారు 193 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం ఉంది. ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, పోలాకి, గార, ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లో సుమారు 38 వేల మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. పాలకులు మారినా వీరి తలరాతలు మాత్రం మార డం లేదు. హామీలు ఇవ్వడం... తర్వాత ఆ ఊసే లేకుండా మర్చిపోవడం పరిపాటిగా మారింది. దశాబ్దాలుగా ఎంతో మంది ముఖ్యమంత్రులు జిల్లాకు వచ్చినప్పుడల్లా ఏదో ఒక మత్స్యకార గ్రామాల్లో పర్యటించి హామీలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇందులో ప్రధానంగా హా ర్బర్‌, కోల్డ్‌స్టోరేజ్‌ల ఏర్పాటు చేస్తామని హామీలు గుప్పిం చినవారే ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో 193 కిలోమీటర్లు తీరప్రాంతం ఉన్న కోల్డ్‌స్టోరేజ్‌ లేకపోవడం గమనార్హం.


తీరం వెంబడి సీజన్‌ను బట్టి కోనెం, చందవలు, వంజరాలు, రొయ్యలు, మాగలు, కవ్వాలు, నెత్తళ్లు, గులివిందలు తదితర రకాల చేపలు వేటాడి తెచ్చినా నిల్వవుంచేందుకు కోల్డ్‌స్టోరేజ్‌ లు లేకపోవడంతో మత్స్యకారులు దళారులకే అప్పగించేస్తు న్నారు. దీంతో ఎంత కష్టపడినా గిట్టుబాటు కావడం లేదని పలువురు మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది గుజరాత్‌లోని ఖండ్లా, ఒడిశాలోని పారాదీప్‌, తమిళనాడు, మహరాష్ట్ర, బెంగాళ్‌ తదితర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపై గంపెడు ఆశలు పెట్టుకున్న మత్స్యకారులకు ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా ముందడుగు లేకపోవడంతో నిట్టూరుస్తున్నారు. బుడగట్లపాలెం వద్ద ఫిషింగ్‌ హార్బర్‌, మంచినీళ్లపేట వద్ద ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రం  నెలకొల్పుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా నేటికీ భూమిపూజ జరగలేదు. దీంతో కోల్డ్‌ స్టోరేజ్‌లపై మత్స్యకారులు పెట్టుకున్న ఆశలు నెరవేరుతాయో లేదో వేచి చూడాల్సిందే...

Updated Date - 2020-07-11T11:34:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising