ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నూతన వ్యవసాయ చట్టాలు రద్దుచేయండి

ABN, First Publish Date - 2020-12-04T04:43:14+05:30

కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు వెంటనే రద్దుచేయాలని రైతుస్వరాజ్యవేదిక ప్రతినిధులు కోరారు.

సోంపేట తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న రైతుసంఘం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 నూతన వ్యవసాయ చట్టాలు రద్దుచేయండి


సోంపేట: కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు వెంటనే రద్దుచేయాలని రైతుస్వరాజ్యవేదిక ప్రతినిధులు కోరారు. ఢిల్లీలో రైతులు చేపడుతున్న నిరసనకు మద్దతుగా జిల్లావ్యాప్తంగా  గురువారం నిరసనలు తెలిపారు. సోంపేటలో నిర్వహించిన ర్యాలీలో ప్రతినిఽధులు వై.కృష్ణమూర్తి, బీన ఢిల్లీరావు, బార్ల సుందరరావు, పోకల చిరంజీవులు పాల్గొన్నారు.ఫ కార్పొరేట్లకు వ్యవసాయాన్ని అప్పగించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు ఉన్నాయని రైతుసంఘం నాయకులు ఆరోపించారు. వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా సోంపేట తహసీల్దార్‌ కార్యాలయం వద్ద గురువారం నిరసన తెలిపారు. రైతుసంఘం నాయకులు సంగారు లక్ష్మీనారాయణ,కె.గోపీనాధ్‌,టి.పాపారావు పాల్గొన్నారు.ఫ పలాస రూరల్‌: మూడు వ్యవసాయ చట్టాల ను ఎత్తివేసి రైతులకు న్యాయం చేయాలని అఖిలభారత రైతుకూలీ సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. పలాస తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలో అఖిలభారత రైతుకూలీ సంఘం నాయకులు నిరసన తెలిపారు.అనంతరం తహసీల్దార్‌ మాధవరావుకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమం లో అఖిలభారత రైతుకూలీల సంఘం జిల్లా కార్యదర్శి వి.మాధవరావు, నాయకులు వినోద్‌, బి.కూర్మా రావు పాల్గొన్నారు. ఫ భామిని: వ్యవసాయరంగాన్ని కార్పొరేట్లకు అప్పగించాలనే ఆలోచనలో మోదీ ప్ర భుత్వం ఉందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శిర్ల ప్రసాద్‌ ఆరోపించారు. సీఐటీ యూ ఆధ్వర్యంలో ఢిల్లీలో చేపడుతున్న రైతు పోరాటం మద్దతుగా భామినిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రజా సంఘ నాయకులు జగన్నాయకులు, అప్పారావు, ప్రసాద్‌  పాల్గొన్నారు.







Updated Date - 2020-12-04T04:43:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising