విద్యుత్ బిల్లుల మోతపై నిరసన
ABN, First Publish Date - 2020-05-19T07:27:52+05:30
కరోనా వైరస్ గడగడ లాడిస్తున్న సమయంలో విద్యుత్ బిల్లుల మోత తగదని, తక్షణం ఈ
గుజరాతీపేట/రామలక్ష్మణ జంక్షన్/టెక్కలి/రాజాం/ పలాస/ మందస/ఆమదాలవలస/పాలకొండ, మే 18: కరోనా వైరస్ గడగడ లాడిస్తున్న సమయంలో విద్యుత్ బిల్లుల మోత తగదని, తక్షణం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర ఖజానాను నింపేందుకు ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకోవడం దారుణమని విమర్శించారు. విద్యుత్ బిల్లుల మోతకు వ్యతిరేకంగా సోమ వారం జిల్లాలోని పలు పట్టణాల్లో సీపీఐ, సీపీఎం తదితర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. శ్రీకాకుళం రామలక్ష్మణ కూడలి వద్ద క్రాంతిభవన్ వద్ద చేపట్టిన కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సనపల నర్సింహులు మాట్లాడుతూ.. లాక్‌డౌన్ కారణంగా అంద రూ ఇళ్లల్లోనే ఉండటం వల్ల విద్యుత్ వినియోగం పెరిగి బిల్లు ఎక్కువ వచ్చిందని సంబంధిత మంత్రులు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి భవిరి కృష్ణమూర్తి మాట్లాడుతూ.. పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, ఏఐటీ యూసీ గౌరవాధ్యక్షుడు చిక్కాల గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యుడు బలగ శ్రీరామ్మూర్తి, సీపీఎం నాయకుడు తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. టెక్కలి, రాజాం, మందస, పలాస, పాలకొండ, ఆమదాలవలస తదితర ప్రాం తాల్లో చేపట్టిన నిరసన ప్రదర్శనల అనంతరం అక్కడి అధికారులకు వినతి పత్రాలు అందించారు. కార్యక్రమంలో స్థానిక వామపక్ష నాయకులు పాల్గొన్నారు.
Updated Date - 2020-05-19T07:27:52+05:30 IST