ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జంట హత్యల కేసులో పురోగతి

ABN, First Publish Date - 2020-06-07T06:40:47+05:30

నగరంలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనుమానితులను విచారిస్తున్న పోలీసులు


శ్రీకాకుళం క్రైం, జూన్‌ 6: నగరంలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలిసింది. గత ఏడాది ఫిబ్రవరి 7న బొందిలీపురంలోని సింధూజ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న అత్తాకో డళ్లు జూరాబాయి (65), మెహరున్నీషా (35)లు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయినా హంతకులు పట్టుబడలేదు. ఈ నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఎంతో మంది పోలీసు అధికారులకు బదిలీ అయ్యింది. ఆ తరువాత వచ్చిన ఎస్పీ ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డి ఆధ్వర్యంలో సీసీఎస్‌ పోలీసులు ఈ జంట హత్య కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తు వేగవంతం చేశారు. దీంతో కొన్ని ఆధారాలు దొరికినట్టు సమాచారం. శుక్రవారం పలువురి అనుమా నితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. కాగా, పోలీసులు తమ వారిని పట్టుకెళ్లిపోయారంటూ కుటుంబ సభ్యులు ఎస్పీని శనివారం కలిసి ఫిర్యాదు చేశారు.  దీనిపె విచారణకు ఎస్పీ ఆదేశించారు.

Updated Date - 2020-06-07T06:40:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising