ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.లక్ష గంజాయి స్వాధీనం

ABN, First Publish Date - 2020-03-08T10:24:57+05:30

గంజాయి రవాణా చేస్తున్న ఒక వ్యక్తిని పలాస ఆర్‌పీఎఫ్‌ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ,లక్ష

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలాస, మార్చి 7: గంజాయి రవాణా చేస్తున్న ఒక వ్యక్తిని పలాస ఆర్‌పీఎఫ్‌ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ,లక్ష విలువైన డంజామిని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఆర్పీఎఫ్‌ ఓసీ కెకె.సాహు చెప్పిన  వివరాల్లోకి వెళితే.. శుక్రవారం రాత్రి భువనేశ్వర్‌ నుంచి ముంబాయి వెళ్తున్న కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎస్‌-3 బోగీలో వసంతలిమ్మా అనే వ్యక్తి ముంబాయికి వెళ్తున్నారు. బరంపురంలో రైలు ఎక్కిన  నుంచీ.. ఆయన కదలికలు అనుమానంగా ఉండటంతో రైలులో విధులు నిర్వహిస్తున్న ఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి అనుమానం వచ్చింది.


పలాస రైల్వే స్టేషన్‌ రాగానే ఆయన్ని ప్రశ్నించడంతో అసలు విషయం బయట పెట్టాడు. మొత్తం మూడు లగేజి బ్యాగుల్లో 20 కిలోల గంజాయిని ప్యాకింగ్‌ చేసి ముంబాయికి రవాణా  చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఆయన స్వగ్రామం ఒడిసా రాష్ట్రం గజపతి జిల్లా మోహనబ్లాక్‌ సుర్లభా. బరంపురం వరకు వివిధ రోడ్డు మార్గాలు ద్వారా ప్రయాణించి అక్కడ రైలు ఎక్కినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి ఆయన నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు.  ఈ దాడుల్లో ఎస్‌ఐ ఎకె.నాయక్‌, సిబ్బంది ఎస్‌కె.నందా, ఎకె.స్వాయ్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.  నిందితుడిని పట్టుకున్న సిబ్బందిని ఓసీ అభినందించారు.

Updated Date - 2020-03-08T10:24:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising