ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు నర్సింగ్‌ హోమ్‌ల మూత

ABN, First Publish Date - 2020-09-20T10:36:45+05:30

ఇచ్ఛాపురంలో రిజిస్ర్టేషన్‌ లేకుండా నడుపుతున్న అమ్మ, నందిని నర్సింగ్‌హోమ్‌లను అధికారులు మూసివేయించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇవి నడుస్తున్నట్టు గుర్తించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 అనుమతి లేకుండా నిర్వహణ

 ప్రైవేటు ఆసుపత్రులకు రిజిస్ర్టేషన్‌ తప్పనిసరి

 డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ లీల


(ఇచ్ఛాపురం, సెప్టెంబరు 19):

ఇచ్ఛాపురంలో రిజిస్ర్టేషన్‌ లేకుండా నడుపుతున్న అమ్మ, నందిని నర్సింగ్‌హోమ్‌లను అధికారులు మూసివేయించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇవి నడుస్తున్నట్టు గుర్తించారు. ప్రైవేటు ఆసుపత్రులకు రిజిస్ర్టేషన్‌ తప్పనిసరని, లేకపోతే క్రిమినల్‌ కేసులు నమోదు చేయడంతోపాటు క్లినిక్‌లను సీజ్‌ చేస్తామని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ లీల హెచ్చరించారు.  శనివారం ఇచ్ఛాపురంలో ఐదు ప్రైవేటు నర్సింగ్‌ హోమ్‌లను తనిఖీ చేశారు.



వీటిలో రెండింటికి అనుమతి లేదని నిర్ధారించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిబంధనలకు వ్యతిరేకంగా వైద్యం చేస్తే ప్రైవేటు ఆసుపత్రులను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. ఇచ్ఛాపురంలో ప్రైవేటు వైద్యులు రిజిస్ర్టేషన్లు లేకుండా క్లినిక్‌లు నడుపుతున్నారని తెలిపారు. కొందరు హోమియోపతి సర్టిఫికెట్లతో అల్లోపతి వైద్యం అందిస్తున్నారని చెప్పారు


. పట్టణానికి చెందిన కొయ్యి పద్మనాభం రెడ్డి ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రైవేటు ఆసుపత్రులు తనిఖీ చేశామని తెలిపారు. అనుమతి లేని ఆస్పత్రులపై విచారణకు సంబంధించిన నివేదికను  ఉన్నతాధికారులకు   అందజేయనున్నట్లు తెలిపారు.

Updated Date - 2020-09-20T10:36:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising