ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలువ గట్టు తవ్వేస్తున్నారు..

ABN, First Publish Date - 2020-05-28T09:15:31+05:30

మండలంలో గ్రామాలకు సాగునీరందించే లుకలాం ఓపెన్‌హెడ్‌ చానల్‌ గట్టును కొందరు రైతులు తవ్వి తమ పొలాల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఆందోళనలో రైతన్నలు

జలుమూరు, మే 27: మండలంలో గ్రామాలకు సాగునీరందించే లుకలాం ఓపెన్‌హెడ్‌ చానల్‌ గట్టును కొందరు రైతులు తవ్వి తమ పొలాల్లో కలుపేసుకుంటుండడంతో దిగువ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాలువ గట్టు తవ్వేయడంతో గట్టు బలహీనమై సాగునీరందే అవకాశం ఉండదని, వంశధార అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదన్న విమర్శలొస్తున్నాయి. కాలువల ఆధునికీకరణలో భాగంగా రెండేళ్ల కిందట లుక లాం ఓపెన్‌హెడ్‌ చానల్‌ పనులు చేపట్టి గట్లను పటిష్టం చేశారు. ప్రస్తుతం పర్లాం, మాకివలస, ఉడకలపేట వద్ద కాలువ పక్కన ఉన్న రైతులు ఆ గట్టును జేసీబీలతో తవ్వి ట్రాక్టర్లతో మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. గట్టు తవ్వకం వల్ల బలహీనమై వర్షాలు పడే సమయంలో గట్టుకు గండి పడి పంటలు నష్టపోయే పరిస్థితి ఉం దని పలువురు రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా తగు చర్యలు తీసుకుని గట్టును పరిరక్షించాలని వారు కోరుతున్నారు. దీనిపై నరసన్నపేట వంశధార డీఈ మురళీమోహన్‌ వద్ద ప్రస్తావించగా గట్టు తవ్వకం తన దృష్టికి ఇంతవరకు రాలేదన్నారు. సమాచారాన్ని జేఈతో విచారణ చేయించి గట్టు తవ్వకం పనులు నిలుపుదల చేస్తామని వివరణ ఇచ్చారు.

Updated Date - 2020-05-28T09:15:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising