ఆక్రమణలు అడ్డుకున్న అఽధికారులు
ABN, First Publish Date - 2020-08-22T08:43:58+05:30
పొందూరు పంచాయతీ పరిధిలోని రాపాక కూడలిలో ఆక్రమణలను అఽధికారులు శుక్రవారం అడ్డుకున్నారు. ఇక్కడి 304 సర్వేనంబరులోని పాన్పులగె
పొందూరు, ఆగస్టు 21: పొందూరు పంచాయతీ పరిధిలోని రాపాక కూడలిలో ఆక్రమణలను అఽధికారులు శుక్రవారం అడ్డుకున్నారు. ఇక్కడి 304 సర్వేనంబరులోని పాన్పులగెడ్డ పక్కన ఏర్పాటు చేస్తున్న లేఅవుట్ కోసం రో డ్డును నిర్వాహకులు అభివృద్ధి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆక్రమణలపై ఫిర్యాదు రావడంతో పంచాయతీ ఈవో అనూరాధ, సీనియర్ అసిస్టెంట్ నర్సింహ నాయుడు రోడ్డు నిర్మాణంలో ఉన్న జేసీబీని సీజ్‌చేశారు. గతంలో నాలుగు సార్లు నోటీసులు ఇచ్చినా ఆక్రమణదారులు స్పందించలేదని, దీంతో ఈ విషయంపై కేసు నమోదుచేస్తున్నట్లు ఈవో తెలిపారు.
బీజేపీ అధ్యక్షుడి దృష్టికి...
పొందూరు పంచాయతీ పరిధిలో 304 సర్వే నంబరు పాన్పులగెడ్డ, 310 సర్వేనంబర్లల్లోని ప్రభుత్వభూముల్లో ఆక్రమణలపై అఖిలభారత బీసీ సంక్షేమ సంఘ జిల్లా ప్రధానకార్యదర్శి బి.దామోదరరావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బండారు ప్రతాప్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు దృష్టికి తీసుకువెళ్లారు. ఆక్రమణల వల్ల వందలాది ఎకరాలకు నీరం దడం లేదని, ఈవిష యంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు.
Updated Date - 2020-08-22T08:43:58+05:30 IST