ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బయోవ్యర్థాలను బయట పడేయొద్దు

ABN, First Publish Date - 2020-04-09T12:01:55+05:30

ఆస్పత్రుల నుంచి బయో మెడికల్‌ వ్యర్థాలను బయట పడేయొద్దని ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రిని తనిఖీ చేసిన అధికారులు


శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, ఏప్రిల్‌ 8 : ఆస్పత్రుల నుంచి బయో మెడికల్‌ వ్యర్థాలను బయట పడేయొద్దని ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఆదేశించా రు. శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో విని యోగించిన సూదులు, సిరంజిలు, రోగి శరీరం నుంచి తొలగించిన వ్యర్థ పదార్థాలు, తదితర వాటిని ఎక్కడిపడితే అక్కడే పారవేయ డంపై ‘ఆంధ్రజ్యోతి’లో బుధవారం ‘భయో మెడికల్‌!’ అనే శీర్షికతో  కథనం వచ్చింది. దీనిపై కలెక్టర్‌ జె.నివాస్‌ స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్‌ ఎస్‌.శంకర్‌నాయక్‌ సర్వజన ఆస్పత్రిని తనిఖీ చేశారు.


ఆసుపత్రి వ్యర్థాలను ఎక్కడ నిల్వచేస్తున్నారు.. ఎలా అందజేస్తున్నారు.. అలానే కాంట్రాక్టు కుదుర్చు కున్న రైన్‌బౌ సక్రమంగా తరలిస్తున్నారా..? ఎక్కడకు తరలిస్తున్నారన్నది అన్న అంశాలను పరిశీలించారు. మెడికల్‌ వ్యర్థాలను పారబోస్తున్న సిబ్బందిని, స్థానికులను కూడా ఆరాతీశారు. వ్యర్థాలను నిల్వఉంచే ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కృష్ణవేణి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ కృష్ణమూర్తి, ఇన్‌చార్జి ఆర్‌ఎం డాక్టర్‌ అరవింద్‌తో  సమావేశం నిర్వహించారు.


కరోనా పొంచి ఉందని.. దీని దృష్ట్యా బయోమెడికల్‌ వ్యర్థాలపై అశ్రద్ధ  వద్దని ఆయన సూచించారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సూచించిన నిబంధనలను పాటించాలని స్పష్టంచేశారు. బయో వ్యర్థా లను తరలించే వాహనాలకు జాగ్రత్తగా వాటిని అందజేయాలని సూచించారు. 

Updated Date - 2020-04-09T12:01:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising