భవనాల నిర్మాణానికి ఇబ్బంది లేకుండా చర్యలు
ABN, First Publish Date - 2020-11-04T04:39:51+05:30
ఆర్బీకే కేంద్రాలు, సచివాలయ భవనాల నిర్మాణ పనులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సిమెంట్, ఇసుక సరఫరా చేస్తామని, ఎవరికీ ఎటువంటి నష్టం కలుగకుండా బిల్లుల చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ జె.నివాస్ అన్నారు.
ఎవరికీ నష్టం కలుగనివ్వం
అవసరం మేరకు ఇసుక, సిమెంట్ సరఫరా
కలెక్టర్ నివాస్
రాజాం, నవంబరు 3: ఆర్బీకే కేంద్రాలు, సచివాలయ భవనాల నిర్మాణ పనులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సిమెంట్, ఇసుక సరఫరా చేస్తామని, ఎవరికీ ఎటువంటి నష్టం కలుగకుండా బిల్లుల చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ జె.నివాస్ అన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో మంగళవారం ఉపాధి హమీ పథకం మెటీరియల్ కాంపొనెంట్ పనులపై నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలో పను లు చేపట్టిన వారికి ఉచితంగా జలుమూరు మండలం పర్లాం ఇసుక ర్యాం పు నుంచి సరఫరా చేస్తున్నామని, నరసన్నపేటలో కూడా ఉచిత ర్యాంపు ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామా ల్లోనూ ఇసుక సమస్య కారణంగా పనులు చేపట్టలేక పోతున్నామని, తగుచర్యలు తీసుకోవాలని, ఓని గ్రామం వద్ద ఇసుక ర్యాంపు చేయాలని ఎమ్మెల్యే కంబాల జోగులు, ఉత్తారవిల్లి సురేష్‌ముఖర్జీ, ఆర్.నరసింగరావు కోరగా కలెక్టర్ స్పందిస్తూ.. తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చా రు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ.. రాజాం పట్టణం నగర పంచాయతీ ఏర్పాటు చేసి 16 ఏళ్లు కావస్తోందని, 60 శాతం మంది వ్యవసాయ కూలీలు న్నారని ఉపా ధి నిధులు వర్తించకపోవడంతో ఇబ్బందులుపడుతున్నారన్నారు. రైతులకు వ్యవసాయ పరికరాలు, విత్తనాలు అందించే చర్యలు తీసుకుని న్యాయం చేయాలన్నారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ పాలవలస విక్రాంత్, డ్వామా పీడీ హెచ్.కూర్మారావు, పంచాయతీరాజ్ ఎస్‌ఈ రామ్మోహన్ రావు, జేసి-3 శ్రీరాములునాయుడు, కమిషనర్ ఎన్.రమేష్, ఏపీవో ఆర్. ఈశ్వరమ్మ, పట్టణ వైసీపీ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు, నాలుగు మండలాల అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2020-11-04T04:39:51+05:30 IST