ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధర్నా భగ్నం

ABN, First Publish Date - 2020-11-28T04:18:14+05:30

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతు, కార్మిక సంఘాలు చేపట్టిన ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. శుక్రవారం శ్రీకాకుళంలోని ఆదాయపు పన్ను జిల్లా కార్యాలయం వద్ద అఖిల భారత కిసాన సంఘర్షణ్‌ కో ఆర్డినేషన కమిటీ ఆధ్వర్యంలో రైతు సంఘాలు, వామపక్షాలు, ట్రేడ్‌ యూనియన్ల నాయకులు ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి.

ధర్నా చేస్తున్న ప్రజా సంఘాల ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఉద్యమించిన రైతు, కార్మిక సంఘాలు

వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

ఆందోళనకారులను అదుపు చేసిన పోలీసులు

గుజరాతీపేట, నవంబరు 27 :

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతు, కార్మిక సంఘాలు చేపట్టిన ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. శుక్రవారం శ్రీకాకుళంలోని ఆదాయపు పన్ను జిల్లా కార్యాలయం వద్ద అఖిల భారత కిసాన సంఘర్షణ్‌ కో ఆర్డినేషన కమిటీ ఆధ్వర్యంలో రైతు సంఘాలు, వామపక్షాలు, ట్రేడ్‌ యూనియన్ల నాయకులు ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి. అన్ని పంటలకూ కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం చేయాలి. కేరళ తరహా రైతు రుణ విమోచనా చట్టం చేయాలి. వ్యవసాయానికి ఉచిత విద్యుత యధాతథంగా కొనసాగించాలి. జీవో నెంబర్‌ 22ను రద్దు చేయాలి. కార్మిక లేబర్‌ కోడ్‌లు ఉపసంహరించాలి’ అని డిమాండ్‌ చేశారు. మూడు వ్యవసాయ చట్టాల వల్ల రిలయన్స్‌, వాల్‌మార్ట్‌ వంటి బడా సంస్థల చేతిలోకి వ్యవసాయ రంగం వెళ్తుందన్నారు. వారు కృత్రిమ కొరత సృష్టించి.. ధరలు విపరీతంగా పెంచి రైతులను దోచుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానాలను విడనాడాలని కోరారు. ధర్నా తీవ్రమవుతున్న దశలో పోలీసులు భగ్నం చేశారు. సుమారు 35 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని శ్రీకాకుళం రెండో పట్టణ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం సొంత పూచీకత్తుపై వారిని విడిచిపెట్టారు. కార్యక్రమంలో  సీపీఎం నగర పార్టీ అధ్యక్షుడు టి.తిరుపతిరావు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దుప్పల గోవిందరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పేకల తేజేశ్వరరావు, అఖిల భారత కిసాన్‌ సంఘర్షణ్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ నాయకుడు కె.మోహనరావు, సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు బవిరి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.






Updated Date - 2020-11-28T04:18:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising