ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రియల్‌ ఎస్టేట్‌ మీదే చంద్రబాబుకు ప్రేమ

ABN, First Publish Date - 2020-07-05T11:52:39+05:30

పరిపాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల అభివృద్ధిని కాంక్షిస్తూ సీఎం జగన్‌ ప్రభుత్వం ముందుకు వెళుతుంటే మాజీ సీఎం చంద్రబాబుకి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మంత్రి ధర్మాన కృష్ణదాస్‌


మబగాం (పోలాకి), జూలై 4: పరిపాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల అభివృద్ధిని కాంక్షిస్తూ సీఎం జగన్‌ ప్రభుత్వం ముందుకు వెళుతుంటే మాజీ సీఎం చంద్రబాబుకి రాష్ట్రం మీద కాకుండా రియల్‌ ఎస్టేట్‌ మీదే ఎక్కువ ప్రేమ కనిపిస్తోందని మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ విమర్శించారు. శనివారం మబగాంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అతి పెద్ద నగరంగా రానున్న 20 ఏళ్లలో ముంబై నగరంతో పోటీపడగలిగే విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటిస్తే కోర్టుకు వెళ్లారని, ఉత్తరాంధ్రకు న్యాయం చేయాలని చంద్రబాబు ఏనాడూ భావించలేదన్నారు.


కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటిస్తే అటు మండలిలో, ఇటు కోర్టుల ద్వారా మోకాలడ్డుతున్నారన్నారు. టీడీపీ డ్రామాను కృష్ణా, గుంటూరు జిల్లాలతో సహా మొత్తం 13 జిల్లాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. దశాబ్దాల తరబడి నిర్లక్ష్యానికి గురైన ఉత్తరాంధ్రకు ఇప్పటికైనా న్యాయం జరుగుతుంటే చంద్రబాబు మోకాలడ్డడం భావ్యం కాదన్నారు.

Updated Date - 2020-07-05T11:52:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising