ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇదేం పని?

ABN, First Publish Date - 2020-05-22T10:55:07+05:30

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను అధికారులు ఆర్భాటంగా ప్రారంభించారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జలుమూరు(శ్రీకాకుళం): మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను అధికారులు ఆర్భాటంగా ప్రారంభించారు. మద్దతు ధర కల్పించి కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో రైతులు ఎంతగానో సంతోషించారు. కానీ ప్రక్రియ మూన్నాళ్ల ముచ్చటగా మారింది. కొనుగోలు చేసిన మొక్కజొన్న బస్తాలను రైతుల వద్దే విడిచిపెట్టారు. బిల్లులు సైతం చెల్లించకపోవడంతో అసలు సరుకు కొనుగోలు చేసినట్టా లేదా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతుల వద్ద వదిలేసిన బస్తాలను సంరక్షించలేక ఇబ్బందిపడుతున్నారు.


తక్షణం బిల్లులు చెల్లించి మొక్కజొన్న బస్తాలు తీసుకెళ్లాలని నగిరికటకం గ్రామానికి చెందిన బగ్గు బుచ్చయ్య, యిప్పిలి అప్పారావు, రావాడ శిమ్మన్న, సూర్యనారాయణ తదితర రైతులు కోరుతున్నారు. దీనిపై చల్లవానిపేట సొసైటీ సీఈవో సత్యారావును వివరణ కోరగా ఇప్పటికే 8 వేల బస్తాలను కొనుగోలు చేసి మార్క్‌ఫెడ్‌కు తరలించినట్టు చెప్పారు. మరో 10 వేల బస్తాలు తరలించేందుకు మార్క్‌ఫెడ్‌ నుంచి అనుమతులు రావాల్సి ఉందన్నారు. వచ్చిన వెంటనే తరలిస్తామని చెప్పారు.

Updated Date - 2020-05-22T10:55:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising