ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదర్శ గ్రామంగా మబగాం

ABN, First Publish Date - 2020-12-14T05:16:38+05:30

విద్యావంతులు, రాజకీయ చైతన్యం కలిగిన వ్యక్తులున్న గ్రామాన్ని చెత్తరహిత గ్రామంగా తీర్చిదిద్ది రాష్ట్రం లోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, ఇందుకు గ్రామస్థులంతా సహకరించాలని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు.

ప్రమాణం చేయిస్తున్న డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌ 

మబగాం(పోలాకి) డిసెంబరు 13: విద్యావంతులు, రాజకీయ చైతన్యం కలిగిన వ్యక్తులున్న గ్రామాన్ని చెత్తరహిత గ్రామంగా తీర్చిదిద్ది రాష్ట్రం లోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, ఇందుకు గ్రామస్థులంతా సహకరించాలని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. గ్రామ సచివాలయ ప్రాంగణంలో ఆదివారం ఎంపీడీఓ రాధాకృష్ణ అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై సహకరించాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు మరింత చేరువకావాలన్నా, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నా పల్లెలు పరిశుభ్రంగా ఉండాలన్నారు. ప్రభుత్వం తడి, పొడి చెత్త సేకరణను పెద్ద ఎత్తున చేపడుతోందని, ఇందులో అందరూ భాగస్వాములు కావాలని కోరా రు. వ్యర్థాలపై యుద్ధం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. చెత్త సేకరణ ఉద్యమంలో చిత్తశుద్ధితో పనిచేయని ఉద్యోగులను, వలంటీర్లను తొలగించాలని ఎంపీ డీవోను ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతామని గ్రామస్థులతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పింఛన్‌, వివిధ సంక్షేమ పథకాల మంజూరు పత్రాలను ఆయన లబ్ధిదారులకు అందించారు. అనంతరం ప్లకార్డులు పట్టుకుని వీధుల్లో అవ గాహన ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో సచివాలయ కార్యదర్శి శోభారాణి యువజన నాయకుడు ధర్మాన లక్ష్మణదాస్‌, హెచ్‌ఎం వై.వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. 

 

 

Updated Date - 2020-12-14T05:16:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising