ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లారీ డ్రైవర్‌ దుర్మరణం!

ABN, First Publish Date - 2020-12-08T04:54:13+05:30

ఎచ్చెర్లలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ ప్రాంగణంలోని వెనుక భాగం అది. సోమవారం ఉదయం వసతిగృహాలు, అడ్మిన్‌ భవన నిర్మాణ పనుల కోసం స్థలాన్ని చదును చేస్తున్నారు. పోగుచేసిన మట్టిని ఇదే ప్రాంగణంలో వేరేచోట లారీతో డంప్‌ చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో మట్టిలోడుతో వెళ్లిన లారీ ఎంతసేపటికీ తిరిగి రాలేదు. కూతవేటు దూరం కావడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు వెళ్లిచూడగా.. లారీ చెంతనే గుర్తుపట్టలేని విధంగా డ్రైవర్‌ మృతదేహం కనిపించింది. లారీ పైభాగాన్ని తాకుతూ హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్లు ఉన్నాయి. దీంతో విద్యుదాఘాతంతో లారీడ్రైవర్‌ మృతిచెందినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

రోదిస్తున్న మృతుడి కుటుంబ సభ్యులు, ఇన్‌సెట్లో సంతోష్‌ (ఫైల్‌ఫోటో)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యుదాఘాతమే కారణం

వాహనం చెంతనే గుర్తుపట్టలేని విధంగా మృతదేహం

ఎచ్చెర్ల, డిసెంబరు 7: ఎచ్చెర్లలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ ప్రాంగణంలోని వెనుక భాగం అది. సోమవారం ఉదయం వసతిగృహాలు, అడ్మిన్‌ భవన నిర్మాణ పనుల కోసం స్థలాన్ని చదును చేస్తున్నారు. పోగుచేసిన మట్టిని ఇదే ప్రాంగణంలో వేరేచోట లారీతో డంప్‌ చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో మట్టిలోడుతో వెళ్లిన లారీ ఎంతసేపటికీ తిరిగి రాలేదు. కూతవేటు దూరం కావడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు వెళ్లిచూడగా.. లారీ చెంతనే గుర్తుపట్టలేని విధంగా డ్రైవర్‌ మృతదేహం కనిపించింది. లారీ పైభాగాన్ని తాకుతూ హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్లు ఉన్నాయి. దీంతో విద్యుదాఘాతంతో లారీడ్రైవర్‌ మృతిచెందినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మృతిచెందిన లారీ డ్రైవర్‌ డొంక సంతోష్‌ (32)గా గుర్తించారు.  మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడిది ఎచ్చెర్ల మండలం చిలకపాలెం. ఈయనకు భార్య రేవతి, ఇద్దరు పిల్లలు జ్యోతీష్‌, హరీష్‌ ఉన్నారు. సంతోష్‌ మృతిచెందాడని తెలుసుకున్న వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు పెద్దఎత్తున ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. గ్రామ పెద్దల సమక్షంలో శవపంచనామా చేసి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రాజేష్‌ తెలిపారు.

   

Updated Date - 2020-12-08T04:54:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising