ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అద్దెలు చెల్లించని షాపులకు తాళాలు

ABN, First Publish Date - 2020-11-22T05:05:07+05:30

పలాస-కాశీబుగ్గ పురపాలకసంఘంలో కొత్త నిబంధనల మేరకు పెంచిన అద్దెలు చెల్లించని షాపులను కమిషనర్‌ నారాయణ ఆధ్వర్యంలో శనివారం సిబ్బంది తాళం వేయించారు.

నోటీసులను పరిశీలిస్తున్న మునిసిపల్‌ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొరడా ఝళిపించిన మునిసిపల్‌ అధికారులు

పలాస, నవంబరు 21: పలాస-కాశీబుగ్గ పురపాలకసంఘంలో కొత్త  నిబంధనల మేరకు పెంచిన అద్దెలు చెల్లించని షాపులకు కమిషనర్‌ నారాయణ ఆధ్వర్యంలో శనివారం సిబ్బంది తాళం వేయించారు. మహాత్మా గాంధీ, కోట్ని గురుమూర్తి షాపింగ్‌ కాంప్లెక్స్‌, ఐడీఎస్‌ఎంటీ షాపుల్లో నిబంధనల ప్రకారం అద్దెలను పెంచుతూ నోటీసులిచ్చారు. 15 రోజులు గడుస్తున్నా వ్యాపారుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో అధి కారులు కొరడా ఝళిపించారు. కొంతమంది  అద్దె చెల్లింపునకు ముం దుకు రావడంతో రూ.15 లక్షలు వసూళ్లయింది. 2017 నుంచి అద్దె పెంచు తూ ప్రభుత్వ జీవో జారీచేసిందని  కమిషనర్‌ నారాయణ  తెలిపారు.ఈ విషయంపై ఇదివరకే నోటీసులు జారీచేసినా వ్యాపారుల నుంచి స్పందన లేదని, అద్దె చెల్లించకపోవడంతో మునిపాల్టీ నిర్వహణ భారంగా మారు తోందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని చర్యలకు ఉపక్రమించామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్వో అప్పలస్వామి, ఆర్‌ఐ అమర్‌నాథ్‌, సిబ్బంది పాల్గొన్నారు. 

 

 

Updated Date - 2020-11-22T05:05:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising