ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొబ్బరి రైతుకు కలిసిరాని కాలం!

ABN, First Publish Date - 2020-12-30T06:00:36+05:30

ఉద్దానం కొబ్బరి రైతుకు ఈ ఏడాది కలిసి రాలేదు. తితలీ తుపాను విలయం నుంచి ఇంకా కోలుకోలేదు. మార్కెట్‌లో ధర ఉన్నా దిగుబడి లేదు. అంతర పంటల సాగుకు ఆశించిన ప్రోత్సాహం లేదు. కొద్దిపాటి ఫలసాయంపై దోమపోటు. తెల్లదోమ ఆవహించడంతో చెట్లు నాశనమవుతున్నాయి. తితలీ పరిహారం రెట్టింపు చేస్తామన్న సీఎం జగన్‌ హామీ ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదు.

తితలీ తుపానులో నేలకొరిగిన కొబ్బరి చెట్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




తితలీ రెట్టింపు పరిహారం ఊసే ఎత్తని ప్రభుత్వం

(కవిటి)

ఉద్దానం కొబ్బరి రైతుకు ఈ ఏడాది కలిసి రాలేదు. తితలీ తుపాను విలయం నుంచి ఇంకా కోలుకోలేదు. మార్కెట్‌లో ధర ఉన్నా దిగుబడి లేదు. అంతర పంటల సాగుకు ఆశించిన ప్రోత్సాహం లేదు. కొద్దిపాటి ఫలసాయంపై దోమపోటు. తెల్లదోమ ఆవహించడంతో చెట్లు నాశనమవుతున్నాయి.  తితలీ పరిహారం రెట్టింపు చేస్తామన్న సీఎం జగన్‌ హామీ ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదు. తితలీ ముందుతో పోలిస్తే  కేవలం పదిశాతం మాత్రమే దిగుబడి వస్తోంది. ప్రతిరెండు నెలలకొసారి కాయలు తీయించే రైతులు ప్రస్తుతం నాలుగు నెలలకు ఒకసారి కూడా తీయించలేకపోతున్నారు. దీనికి కారణం చెట్లలో పిందెలు లేకపోవడమే. ఉన్న పిందెలను తెల్లదోమ తినేస్తోంది. లాక్‌డౌన్‌ సమయంలో కొబ్బరి ఎగుమతులు పూర్తిగా పడిపోయాయి. దీంతో దళారులు ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయించి రైతులను మోసం చేశారు. ఉద్దానం కొబ్బరి అధికంగా కోల్‌కత్తా, ఢిల్లీ, ఛత్తీస్‌గడ్‌, ఒడిశా తదితరల రాష్ట్రాలకు ఎగుమతి చేసేవారు. ఎగుమతులు నిలిచిపోవడంతో తోటల్లో కొబ్బరి నిల్వలు పెరిగిపోవడంతో దళారులు చెప్పిందే ధరగా మారింది.




Updated Date - 2020-12-30T06:00:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising