ఇళ్ల పట్టాల పంపిణీకి సిద్ధం చేయండి
ABN, First Publish Date - 2020-12-15T06:16:54+05:30
నిరుపేదలకు ఈనెల 25న ఇళ్ల పట్టాల పంపిణీకి క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించి సిద్ధంచేయాలని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశించారు.
స్వగ్రామాల్లోనే స్థలాలు కేటాయించండి
స్పీకర్ తమ్మినేని సీతారాం
ఆమదాలవలస రూరల్: నిరుపేదలకు ఈనెల 25న ఇళ్ల పట్టాల పంపిణీకి క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించి సిద్ధంచేయాలని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశించారు. సోమవారం ఆమదాలవలసలో రెవెన్యూ, హౌసింగ్, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కారించాలని రెవెన్యూ అధికారులను కోరారు. స్వగ్రామాల్లోనే లబ్ధిదారులకు స్థలాలను కేటాయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ భూములు లేని గ్రామాల్లో రైతులకు నోటీసులు ఇచ్చి కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఆమదాలవలస మండలంలోని 30 పంచాయతీల్లో 668 మంది, అర్బన్‌లో 2,157 మంది లబ్ధిదారులను ఎంపిక పక్రియ పూర్తి చేసినట్లు అధికారులు వివరించారు.
వంశధార నిర్వాసితులకు స్థలాలు ఇవ్వండి
పట్టణ ప్రాంతంలోని పేదలకు గ్రామీణ ప్రాంతంలో సెంటున్నర కేటా యించాల్సిఉన్నా సెంటు మాత్రమే పంపిణీ చేస్తున్నారని, వరుసగా స్థలాలు కేటాయిస్తుండడంతో అగ్ని ప్రమాదాల సమయంలో నష్టం వాటిల్లుతుందని మునిసిపల్ మాజీ ఫ్లోర్‌లీడర్ బొడ్డేపల్లి రమేష్‌కుమార్ స్పీకర్‌కు వివరిం చారు. అలాగే వంశధార నిర్వాసితులకు మండలంలోని గాజుకొల్లివలసలో ఇళ్ల స్థలాలు కేటాయించారని నిర్వాసితు ల కాలనీకి చెందిన దామోదర కృష్ణ తెలిపారు. అయితే తులగాం నుంచి వలస వచ్చి... గ్రామంలో నివాసం ఉంటున్న 50 కుటుంబాలకు ఇళ్లు లేవని, స్థలాలు కేటాయిం పులో వారికి నష్టం జరిగిందని స్పీకర్ దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ పి.వేణుగోపాలరావు, మునిసి పల్ కమిషనర్ ఎం.రవిసుధాకర్, తహసీల్దార్ జి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
‘జీవక్రాంతి’తో మహిళలకు ఆసరా
సరుబుజ్జిలి: జగనన్న జీవక్రాంతి పథకంతో మహిళలకు ఆసరా లభిస్తుం దని ఎంపీడీవో పి.మురళీమోహన్‌కుమార్ తెలిపారు. సోమవారం సరుబుజ్జిలిలో పంచాయతీ కార్యదర్శులు, వెల్ఫేర్ అసిస్టెంట్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 45 నుంచి 60 సంవత్సరాల వయసు గల మహిళలకు ప్రభు త్వం ఆవులు, గేదెలు కొనుగోలు చేసి అందచేస్తుండడంతో లబ్ధిపొందాలని తెలిపారు. కార్యక్రమంలో పశు వైద్యాధికారి సుభాష్‌చంద్రబోస్, ఏపీఎం కమలకుమారి, పంచాయతీ విస్తరణాధికారి బొంగు శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-15T06:16:54+05:30 IST