రాజాంలో భూ వివాదం
ABN, First Publish Date - 2020-12-01T05:30:00+05:30
భూముల ధరలకు రెక్కలొచ్చిన నేపథ్యంలో దందాలు పెరిగిపోతున్నాయి. ఖాళీగా భూములు కనిపిస్తే చాలు... కబ్జా చేస్తున్నారు. కొంతమంది ప్రబుద్ధులు తమకే ఆ భూమిని విక్రయించాలని భూ యజమానులపై ఒత్తిడి తెస్తున్నారు. ససేమిరా అంటే భయపెడుతున్నారు. నయానో భయానో సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజాం
పంట భూములను చదునుచేసిన వైనం
పార్వతీపురం ప్రజాప్రతినిధిపై ఆరోపణలు
పోలీసుల రంగప్రవేశం
రాజాం రూరల్, డిసెంబరు 1: భూముల ధరలకు రెక్కలొచ్చిన నేపథ్యంలో దందాలు పెరిగిపోతున్నాయి. ఖాళీగా భూములు కనిపిస్తే చాలు... కబ్జా చేస్తున్నారు. కొంతమంది ప్రబుద్ధులు తమకే ఆ భూమిని విక్రయించాలని భూ యజమానులపై ఒత్తిడి తెస్తున్నారు. ససేమిరా అంటే భయపెడుతున్నారు. నయానో భయానో సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజాంలో మంగళవారం ఇదే తరహాలో భూవివాదం తలెత్తిం ది. సుమారు కోటి రూపాయలు విలువ చేసే స్థలంపై వివాదం నెలకొంది. రాజాం మండలం అంతకాపల్లి పంచాయతీ పరిధిలోని మొగిలివలసకు చెందిన లెంక మురళి, పోలీసులు అందించిన వివరాల ప్రకారం..
ఏమైందంటే...
రాజాంకు చెందిన కొంతమంది రియల్టర్ల సహకారంతో మొగిలివలసకు చెందిన లెంక మురళీకి చెందినదిగా చెబుతున్న పంట భూమిని మంగళ వారం మధ్యాహ్నం జేసీబీతో కొందరు చదును చేయడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న మురళి, తదితరులు సంఘటన స్థలానికి చేరుకు న్నారు. చదును చేయిస్తున్న వారితో వాగ్వాదానికి దిగారు. తాము పార్వతీ పురానికి చెందిన ప్రజాప్రతినిధి అనుచరులమని... ఈ భూమి తమదేనని వారు వాదించారు. దీంతో అంతకాపల్లి, మొగిలివలస గ్రామాల నుంచి పెద్దఎత్తున జనం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వివాదం తారస్థాయి కి చేరింది. భూమి తమదంటే...తమదని ఇరువర్గాలు భీష్మించుకు కూర్చు న్నాయి. దీంతో రాజాం పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరువర్గాలతో చర్చించారు. న్యాయస్థానంలో ఈ భూమిని తాము గెలుచుకున్నామంటే ... తాము గెలుచుకున్నామని పోలీసుల ముందు ఇరువర్గాల వారు వాదనలకు దిగారు. కాసేపటికి చదును చేయించే పనిని పోలీసులు నిలుపుదల చేయించారు. జేసీబీ తాళాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో తాత్కా లికంగా వివాదం సద్దుమణిగింది.
ఫిర్యాదు లేదు
వివాదం జరిగిన విషయం నా దృష్టికి వచ్చింది. వెంటనే అక్కడికి సిబ్బందిని పంపి పరిశీలించాం. సమస్య న్యాయస్థానంలో ఉంది. ఎవరూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదు.
పి.శ్రీనివాసరావు, సీఐ
Updated Date - 2020-12-01T05:30:00+05:30 IST