ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దరఖాస్తులు స్వీకరించాల్సిందే

ABN, First Publish Date - 2020-07-18T10:19:03+05:30

సచివాల యాల్లో సమాచార హక్కు చట్టం దరఖాస్తులను స్వీకరించాల్సిందేనని స.హ చట్టం జిల్లా సమన్వయ కమిటీ సభ్యుడు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, జూలై 17: సచివాల యాల్లో సమాచార హక్కు చట్టం దరఖాస్తులను స్వీకరించాల్సిందేనని స.హ చట్టం జిల్లా సమన్వయ కమిటీ సభ్యుడు కొమ్మాజోశ్యుల వసంతకుమార్‌ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. పంచాయతీ కార్యదర్శులు స.హ చట్టం దరఖాస్తులను స్వీకరించకుండా  ఎంపీడీవోకు అందజేయాలని చెబుతున్నట్లు ఫిర్యా దులు వస్తున్నాయన్నారు.  ఈ విషయాన్ని జిల్లా నోడల్‌ అధికారి (జిల్లా రెవెన్యూ అధికారి) దయానిధి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. 


ఈ మేరకు డీపీవో అన్ని మండలాల ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలకు లేఖ రాశారన్నారు. ఇక నుంచి సచివాలయాల్లో సమాచార హక్కు చట్టం దరఖాస్తు లను నిరాకరించకూడదని లేఖలో స్పష్టంగా పేర్కొన్నా రన్నారు.  దరఖాస్తులను స్వీకరించి రశీదు అంద జేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఎలాంటి రుసుం చెల్లించనక్కర్లేదని, కేవలం జిరాక్సు ప్రతులకు మాత్రమే నిబంధనల మేరకు రుసుం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎవరైనా దరఖాస్తు తీసుకునేందుకు నిరాకరిస్తే సంబంధిత ఎంపీడీవోకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Updated Date - 2020-07-18T10:19:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising