ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధ్యయన కమిటీతో జిల్లాకు న్యాయం

ABN, First Publish Date - 2020-07-16T09:33:22+05:30

కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం అధ్యయన కమిటీని వేయడాన్ని స్వాగతిస్తున్నామని, దీనివల్ల శ్రీకాకుళం ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుజరాతీపేట: కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం అధ్యయన కమిటీని వేయడాన్ని స్వాగతిస్తున్నామని, దీనివల్ల శ్రీకాకుళం జిల్లాకు న్యాయం జరుగు తుందని ఆల్‌ ఇండియా బీసీ సంఘం నాయకులు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని తొలుత లేవనెత్తి  ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్‌, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావులకు కృతజ్ఞతలు తెలిపారు.  హర్షం వ్యక్తం చేసిన వారిలో  రాష్ట్ర ఉపాధ్యక్షుడు దుంపల లక్ష్మణరావు, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు డబ్బీరు శ్రీనివాస్‌(వాసు), కార్యదర్శి దామోదర్‌, గౌరవాధ్యక్షుడు, రిటైర్డ్‌ తహసీల్దార్‌ డీపీ దేవ్‌ ఉన్నారు. 


రామలక్ష్మణ జంక్షన్‌: కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం అధ్యయన కమిటీ వేయడంపై శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి వేదిక సభ్యులు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి ప్రొఫెసర్‌ హనుమంతు లజపతిరాయ్‌ హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల జిల్లాల విభజన విషయంలో ప్రజలకు ఉన్న భయాందోళ నలు తొలగుతాయని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఇప్పటికే కొన్ని అంశాలపై వివరిస్తూ సీఎం జగన్‌కు విజ్ఞాపన పత్రం తయారు చేసినట్లు  తెలిపారు.


పాలకొండ (వీరఘట్టం): కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యావంతులు, ఉద్యోగ సంఘాలు, మేధావుల అభిప్రాయాలు సేకరించాలని ఏయూ పాలకమండలి మాజీ సభ్యుడు యర్రాపాత్రుని వెంకటనా యుడు  కోరారు.  బుధవారం ఆయన వీరఘట్టంలో విలేకరులతో మాట్లాడుతూ,  భౌగోళిక పరిస్థితు లు, మౌలిక సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు అన్నింటిని దృష్టిలో ఉంచుకొని జిల్లాలు ఏర్పాటు చేయాలన్నారు. 

Updated Date - 2020-07-16T09:33:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising