ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీకాకుళంలో పని చేయడం అదృష్టం

ABN, First Publish Date - 2020-07-16T09:34:35+05:30

శ్రీకాకుళం జిల్లాలో పని చేయడం తమ అదృష్టమని బదిలీపై వెళ్తున్న న్యాయమూర్తులు ఎస్‌.దేవిరత్నకుమారి, ఎన్‌.శాంతిశ్రీలు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యాయమూర్తులు రత్నకుమారి, శాంతిశ్రీ


గుజరాతీపేట: శ్రీకాకుళం జిల్లాలో పని చేయడం తమ అదృష్టమని బదిలీపై వెళ్తున్న న్యాయమూర్తులు ఎస్‌.దేవిరత్నకుమారి, ఎన్‌.శాంతిశ్రీలు తెలిపారు. జిల్లా బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయమూర్తుల వీడ్కోలు సభ బుధవారం జరిగింది. వీరి సేవలను వక్తలు కొనియాడారు. కార్యక్రమంలో  బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షురాలు గొల్ల రాఽధారాణి, ప్రధాన కార్యదర్శి గెడ్డాపు శ్రీకృష్ణప్రసాద్‌, మీడియా సెల్‌ కన్వీనర్‌ చౌదరి లక్ష్మణరావు, ప్రభుత్వ న్యాయవాది పొన్నాడ వెంకటరమణా రావు, సీనియర్‌ న్యాయవాది వాన కృష్ణచంద్‌ పాల్గొన్నారు. జిల్లాకు బదిలీపై వచ్చిన న్యాయమూర్తులు కె.నాగమణి, పి.రమేష్‌బాబులకు స్వాగతం పలికారు.


పొందూరు: పొందూరు మున్సిప్‌ కోర్టు జడ్జి షేక్‌ రియాజ్‌కు దంపతులకు బుధవారం   బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.  బుధవారం స్థానిక బార్‌అసోసియేషన్‌ కార్యాలయంలో బదిలీపై వెళ్తున్న జడ్జి రియాజ్‌కు సత్కరించారు. ఏజీపీ ఎ.రంగారావు, న్యాయవాదులు, బార్‌ అసోసియేషన్‌ సభ్యులు కె.రమణమూర్తి, కె. రఘు, బ్రహ్మాజి, అప్పలనాయుడు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-07-16T09:34:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising