ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయాల్లో ఉత్తమ సేవలందించండి

ABN, First Publish Date - 2020-10-25T10:46:54+05:30

గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని రెవెన్యూ జేసీ సుమిత్‌కుమార్‌ తెలిపారు. శనివారం కవిటి తహసీల్దార్‌ కార్యాలయంలో వీఆర్వోలతో సమీక్షించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కవిటి: గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని రెవెన్యూ జేసీ సుమిత్‌కుమార్‌ తెలిపారు. శనివారం కవిటి తహసీల్దార్‌ కార్యాలయంలో వీఆర్వోలతో సమీక్షించారు. వీఆర్వో లాగిన్‌లో చేయాల్సిన పనులు ప్రతిరోజూ చూసి ఎప్పటిక్పడు పూర్తిచేయాలని, డిజిటల్‌ అసిస్టెంట్లపై ఆధారపడితే పనులు జరగవని తెలిపారు. ప్రజలతో మమేకమై పనిచేయాలన్నారు. రెవెన్యూ సేవల్లో జిల్లాకు మంచిపేరు తీసుకురావాలన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో రైతు భరోసా కేంద్రాల నిర్మాణానికిగాను 150 సైట్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపా రు. వారంరోజుల్లో పెండింగ్‌ పరిష్కరించి త్వరగా రైతు భరోసా కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుడతామన్నారు.630 వెల్‌నెస్‌ సెంటర్లుకు గాను 600 వరకు జియోట్యాగింగ్‌ పూర్తిచేసినట్లు తెలిపారు. అనంతరం కవిటి నూతన తహసీల్దార్‌ కార్యాలయం, రాజపురం సచివాలయం పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, ఎంపీడీవో సూర్యనారాయణ, పీఆర్‌ జేఈ ప్రవీణ్‌, ఆర్‌ఐ జీవన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-10-25T10:46:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising