ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీజిల్‌ దుర్వినియోగంపై విచారణ

ABN, First Publish Date - 2020-12-11T05:14:10+05:30

కపాసుకుద్దిలో మత్స్యకారులకు ప్రభుత్వం సబ్సిడీపై పంపిణీ చేసిన డీజిల్‌ దుర్వినియోగంపై మత్స్యశాఖ జేడీ శ్రీనివాసరావు విచారణ చేపట్టారు.

కపాసుకుద్దిలో మత్స్యకారులతో మాట్లాడుతున్న జేడీ శ్రీనివాసరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 బాధ్యులపై కఠిన చర్యలు

మత్స్యశాఖ జేడీ శ్రీనివాసరావు

కవిటి: కపాసుకుద్దిలో మత్స్యకారులకు ప్రభుత్వం సబ్సిడీపై పంపిణీ చేసిన డీజిల్‌ దుర్వినియోగంపై మత్స్యశాఖ జేడీ శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. రాష్ట్రప్రభుత్వం మత్స్యకారుల కోసం రాయితీపై డీజిల్‌ను సరఫరాచేస్తోంది. ఈ డీజిల్‌ను కొందరు దుర్వినియోగానికి పాల్పడ్డారని కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. దీంతో మత్స్యశాఖ జేడీ శ్రీనివాసరావు గురువారం కవిటి మండలంలోని కపాసుకుద్దిలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా  శ్రీనివాసరావు  మాట్లాడుతూ రాయితీ డీజిల్‌ దుర్వినియెగానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లబ్ధిదారులకు విచారించినట్లు తెలిపారు. సొసైటీ అధ్యక్షుడు బడేనాయుడు లబ్ధిదారులకు మభ్యపెట్టి  రాయితీ డీజిల్‌ దుర్వినియోగానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తెలుస్తోందని చెప్పారు. లోతుగా విచారణ నిర్వహించి, ఆయన వెనుక ఎవరున్నా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విషయంలో మత్స్యశాఖ ఉద్యోగులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని చెప్పారు. కార్యక్రమంలో పలాస ఏడీ గోపీకృష్ణ, కళింగపట్నం, ఇచ్ఛాపురం ఎఫ్‌డీవోలు బి.సురేష్‌, రవితేజ పాల్గొన్నారు.

 

Updated Date - 2020-12-11T05:14:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising