ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆశలు.. ‘గల్లంతు’!

ABN, First Publish Date - 2020-10-20T08:24:38+05:30

రట్టి సముద్ర తీరంలో ఆదివారం గల్లంతైన ఇద్దరు యువకులు మృతిచెందారు. వారి మృతదేహాలు సోమవారం తీరానికి కొట్టుకొచ్చాయి. ఇందులో సిసింద్రీ (

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రట్టిలో మునిగిన ఇద్దరు యువకులు మృత్యువాత

తీరానికి కొట్టుకొచ్చిన మృతదేహాలు

విషాదంలో బాధిత కుటుంబ సభ్యులు

హరిపురం/వజ్రపుకొత్తూరు, అక్టోబరు 19: రట్టి సముద్ర తీరంలో ఆదివారం గల్లంతైన ఇద్దరు యువకులు మృతిచెందారు. వారి మృతదేహాలు సోమవారం తీరానికి కొట్టుకొచ్చాయి. ఇందులో సిసింద్రీ  (21) మృతదేహం రట్టి తీరంలో మధ్యాహ్నం బయటపడగా... శ్రీకాంత్‌ (21) మృతదేహం వజ్రపుకొత్తూరు మండలం డోకులపాడు తీరానికి సాయంత్రానికి కొట్టుకు వచ్చింది. స్నేహితుడు పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా రట్టి తీరానికి వెళ్లిన ఐదుగురు వ్యక్తులు ఆదివారం సముద్ర స్నానానికి దిగిన సంగతి తెలిసిందే. అలల తీవ్రతకు ఇద్దరు కొట్టుకుపోగా.. ముగ్గురు యువకులు క్షేమంగా తీరానికి చేరారు. 


యువకుల ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఎదురుచూశారు. కలెక్టర్‌ నివాస్‌, కోస్టల్‌ డీఐజీ ఆదేశాల మేరకు మందస ఎస్‌ఐ బి.రామారావు ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు, మత్స్యకారులు, గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, కోస్టల్‌ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం సాయంత్రానికి ఇద్దరి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకురావడంతో శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. తీరానికి కొట్టుకువచ్చిన సిసింద్రీ, శ్రీకాంత్‌ మృతదేహాల వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. 


Updated Date - 2020-10-20T08:24:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising