ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనవరి నుంచి పూర్తిస్థాయి ఆర్టీసీ సర్వీసులు

ABN, First Publish Date - 2020-12-20T04:06:53+05:30

జిల్లాలో జనవరి 1 నుంచి పూర్తిస్థాయి ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి. ఈ మేరకు ఆ సంస్థ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అద్దె బస్సు యజమానులతో శ్రీకాకుళం ఏపీఎస్‌ఆర్టీసీ డివిజనల్‌ మేనేజర్‌ జి.వరలక్ష్మి శనివారం సమావేశం నిర్వహించారు. పల్లెవె లుగు, ఆలా్ట్రడీలక్స్‌, సూపర్‌లక్జరీ సర్వీసులను పునఃప్రారంభించాల్సిందిగా ఆమె అద్దెబస్సు ఓనర్లను కోరారు. బస్సుల కండీషన్‌ తనిఖీ చేయాలని సూచించారు.

సమావేశంలో మాట్లాడుతున్న వరలక్ష్మీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




- డీఎం జి.వరలక్ష్మి 

గుజరాతీపేట, డిసెంబరు 19:  జిల్లాలో జనవరి 1 నుంచి  పూర్తిస్థాయి ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి. ఈ మేరకు ఆ సంస్థ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అద్దె బస్సు యజమానులతో శ్రీకాకుళం ఏపీఎస్‌ఆర్టీసీ డివిజనల్‌ మేనేజర్‌ జి.వరలక్ష్మి శనివారం సమావేశం నిర్వహించారు. పల్లెవె లుగు, ఆలా్ట్రడీలక్స్‌, సూపర్‌లక్జరీ సర్వీసులను పునఃప్రారంభించాల్సిందిగా ఆమె అద్దెబస్సు ఓనర్లను కోరారు. బస్సుల కండీషన్‌ తనిఖీ చేయాలని సూచించారు.  ఎఫ్‌సీ/పర్మిట్‌/ఇన్సూరెన్స్‌, తదితర వివరాలను అందజేయాలని కోరారు. కొవిడ్‌ కారణంగా ఈ ఏడాది మార్చి 21 నుంచి లాక్‌డౌన్‌ అమలైందని, అప్పటి బస్సులను పూర్తిగా నడపలేదని చెప్పా రు. నవంబరు 1 నుంచి ప్రైవేట్‌ హైర్‌ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులను పునరుద్ధరించినట్లు చెప్పారు. ప్రస్తుతం పాఠశాలలు, కాలే జీలు ప్రారంభమయ్యాయని, సంక్రాంతి  సమీపిస్తున్నందున ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇంద్ర ఏసీ బస్సులు మినహా అన్ని బస్సులను జనవరి 1 నుంచి నడపనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రైవేట్‌ బస్సు ఓనర్ల సెక్రటరీ వినోద్‌, మల్వేశ్వరరావు, 1, 2 డిపోల మేనేజర్లు వి.ప్రవీణ, టి.కవిత పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-20T04:06:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising