ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి

ABN, First Publish Date - 2020-07-15T09:43:16+05:30

గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడితే ఆర్థిక పరిస్థితి పుంజుకుం టుందని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్జీయూకేటీ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ కేసీ రెడ్డి 

ముగిసిన ‘ఎఫ్‌డీపీ’ 


ఎచ్చెర్ల, జూలై 14: గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడితే ఆర్థిక పరిస్థితి పుంజుకుం టుందని రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ కేసీ రెడ్డి పేర్కొన్నారు.  అంబేడ్కర్‌ యూనివర్సిటీ వ్యవస్థాపక దినోత్సవంలో భాగంగా గత 21 రోజులుగా డిజిటల్‌ వేదికగా నిర్వహిస్తున్న అధ్యాపక అభివృద్ధికారక కార్యక్రమం (ఎఫ్‌డీపీ) మంగళవారం ముగి సింది. మూడు విడతలుగా ఈ కార్యక్రమం జరిగింది.  పలు వురు శాస్త్రవేత్తలు, సామాజిక అధ్యయనకారులు, విద్యారంగ నిపుణులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, వివిధ వర్సిటీల వీసీలు ప్రత్యేక ప్రసంగాలు చేశారు.


చివరిరోజు కార్యక్ర మంలో కేసీ రెడ్డి మాట్లాడుతూ,  ప్రాఽథమిక, విద్య, వైద్య రంగాలను బలోపేతం చేస్తే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుం దని తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ, తరగతి బోధనలు, ప్రయో గశాల పరిశోధనలు ప్రత్యక్షంగా, పరోక్షంగా సమాజ ప్రగతికి దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో అంబేడ్కర్‌ వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ కూన రాంజీ, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కె.రఘు బాబు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-15T09:43:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising