ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అడ్డదారిలో ఒడిశా ధాన్యం

ABN, First Publish Date - 2020-04-09T12:06:44+05:30

ఒడిశా ధాన్యం ఆంధ్రాకు యథేచ్ఛగా తరలివస్తున్నాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టరనే ఉద్దేశంతో కొందరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లారీల్లో తరలింపు

టెక్కలిలో స్వాధీనం


టెక్కలి, ఏప్రిల్‌ 8: ఒడిశా ధాన్యం ఆంధ్రాకు యథేచ్ఛగా తరలివస్తున్నాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టరనే ఉద్దేశంతో కొందరు మిల్లర్లు.. ధాన్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం టెక్కలిలో రెండు లారీలను పోలీసులు గుర్తించి.. రెవెన్యూ అధికారులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్రం బరంపురం నుంచి వస్తున్న రెండు లారీలు.. ధాన్యం లోడుతో టెక్కలి శివారు ప్రాంతంలో ఫ్లైఓవర్‌ కింద ఉన్నాయి. వీటిని టెక్కలి ఎస్‌ఐ గణేష్‌ బుధవారం గుర్తించి.. రెవెన్యూ అధికారులకు సమాచారం అందజేశారు. వెంటనే ఉప తహసీల్దార్‌ బెండి గిరిబాబు, ఆర్‌ఐ హరి అక్కడకు చేరుకొని రెండు లారీల్లో వచ్చిన ధాన్యంపై ఆరాతీశారు.


ఈ ధాన్యం బరంపురం నుంచి తూర్పుగోదావరి జిల్లా మండపేటకు తీసుకెళ్తున్నట్టు లారీడ్రైవర్లు చెప్పారు.  ఒడిశా నుంచి వచ్చిన ధాన్యం నేరుగా మండపేటకు వెళ్లకుండా జాతీయ రహదారి ఫ్లైఓవర్‌ కింద ఉండడం అనుమానాలకు తావిస్తోంది. లారీ సిబ్బంది వద్ద రెవెన్యూ అధికారులు వివరాలు సేకరించిన తరువాత 6ఏ కేసు నమోదు చేశారు. కార్మికుల కొరత కారణంగా.. సీజ్‌ చేసిన ధాన్యాన్ని అన్‌లోడ్‌ చేయకుండా పోలీసులకు అప్పగించారు. లారీ యాజమాన్యాలపై కూడా క్రిమినల్‌ కేసులు నమోదు చేయనున్నట్టు ఉప తహసీల్దార్‌ గిరి తెలిపారు.  

Updated Date - 2020-04-09T12:06:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising