ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మత్తు కోసం శానిటైజర్లు వాడవద్దు

ABN, First Publish Date - 2020-08-07T10:27:09+05:30

మత్తు కోసం శానిటైజర్లు ఉపయోగించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సీఐ వినోద్‌బాబు, పట్టణ ఎస్‌ఐ సత్యనారాయణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇచ్ఛాపురం: మత్తు కోసం శానిటైజర్లు ఉపయోగించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సీఐ వినోద్‌బాబు, పట్టణ ఎస్‌ఐ సత్యనారాయణ అన్నారు. గురువారం పట్టణ పరిధిలోని మురికివాడల్లో సంచార వాహనం ద్వారా శానిటైజర్ల వినియోగంపై అవగాహన కల్పించారు. శానిటైజర్లు తాగితే ప్రాణాలు కోల్పోతారని, మద్యం, శానిటైజర్లకు మధ్య తేడా తెలుసుకోవాలని తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని సూచించారు.


ఫశానిటైజర్ల కొనుగోలుకు మెడికల్‌ షాపులకు వచ్చేవారిపై ఎటువంటి అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ తెలిపారు. పట్టణంలోని మెడికల్‌ స్టోర్స్‌లను సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు.  ఆధార్‌, ఫోన్‌నంబర్‌, ఇతర వివరాలు తీసుకొని శానిటైజర్లు విక్రయించాలని దుకాణదారులకు సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఈబీ సీఐ జనార్దనరావు, తదితరులు పాల్గొన్నారు. 


పాలకొండ రూరల్‌: మెడికల్‌ షాపుల్లో నాణ్యమైన శానిటైజర్లు విక్రయించాలని ఎక్సైజ్‌ సీఐ సునీల్‌కుమార్‌ తెలిపారు. గురువారం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సీఐ సునీలకుమార్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు మెడికల్‌ షాపుల్లో శానిటైజర్లను పరిశీలించారు. బ్రాండ్లు కలిగిన శానిటైజర్లు విక్రయించాలని సూచించారు. అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2020-08-07T10:27:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising