రూ.5 కోట్లతో అభివృద్ధి పనులు
ABN, First Publish Date - 2020-06-18T11:17:25+05:30
పలాసపురం పంచాయతీ పలాసపురం, లక్కవరంలల్లో అభివృద్ధి పనులకు రూ.ఐదు కోట్లు మంజూరైనట్లు డీసీఎంఎస్ చైర్మన్ పిరియా
డీసీఎంఎస్ చైర్మన్ పిరియా సాయిరాజ్
సోంపేట రూరల్, జూన్ 17 : పలాసపురం పంచాయతీ పలాసపురం, లక్కవరంలల్లో అభివృద్ధి పనులకు రూ.ఐదు కోట్లు మంజూరైనట్లు డీసీఎంఎస్ చైర్మన్ పిరియా సాయిరాజ్ తెలిపారు. బుధవారం పలాసపురం, లక్కవరంలో ఏర్పాటుచేసిన గ్రామసభల్లో ఆయన మాట్లాడారు. సోంపేట-బారువ రోడ్డు నుంచి పలాసపురం, లక్కవరం మీదుగా జాతీయరహదారి, కల్వర్టుల నిర్మాణానికి ఏఐబీ, ఏపీఆర్‌ఆర్‌బీ గ్రాంట్ల ద్వారా రూ.ఐదు కోట్ల్లు మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు నిమ్మన దాసు, తడక జోగారావు, సనపల శ్రీరామ్మూర్తి, పిరియా అప్పలస్వామి, బెందాళం శివాజీ, విక్రం పాల్గొన్నారు.
రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలి
మునిసిపాలిటీ పరిధిలో మూడు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఏఎంసీ చైర్మన్ చాట్ల సుజాత డీసీఎంఎస్ చైర్మన్ సాయిరాజ్‌కు విన తిపత్రం అందజేశారు. మునిసిపాలిటీలోని 23వార్డుల పరిధిలో మూడు వేల మందికిపైగా రైతులు ఉన్నారని తెలిపారు. ఇక్కడ విత్తనాలు, ఎరువులకు, వ్యవసాయ అధికారుల సలహాలకు, సంక్షేమ పఽథకాలు అందక రైతులు ఇబ్బందిపడుతున్నారని సాయిరాజ్‌కు వివరించారు. రైతుల సమస్యలు దృష్టిలో పెట్టుకొని బెల్లుపడ, రత్తకన్న, ఏఎస్‌పేట లేదా పురుషోత్తపురంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. వైసీపీ నేతలు చాట్ల తులసీదాస్‌రెడ్డి, ప్రకాష్ పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి
నియోజకవర్గ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని డీసీఎంఎస్ చైర్మన్ పిరియా సాయిరాజ్ తెలిపారు. బుధవారం బల్లిపుట్టుగలోని తన నివాసంలో పలువురు సమస్యలపై వినతిపత్రం అందించారు. కుసుంపురంలో నిత్యానంద యువజన సంఘం ఆధ్వర్యంలో సామాజిక భవనాన్ని నిర్మించాలని సంఘం సభ్యులు పంచానన దొళాయి, శ్రీకాంత్ దొళాయి వినతిపత్రం అందజేశారు. రజకులకోసం దోబీఘాట్లు ఏర్పాటు చేయాలని, చెరువులు మరమ్మతు చేయాలని, నీటి సదుపాయాలు కల్పించాలని రజక సంఘం పెద్దలు ఎం.ధర్మారావు, రంజిత్ కోరారు.
Updated Date - 2020-06-18T11:17:25+05:30 IST