ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాడు-నేడు పనులు వేగవంతం చేయాలి

ABN, First Publish Date - 2020-11-13T05:47:41+05:30

పాఠశాలల్లో చేపడుతున్న నాడు-నేడు పనులను వేగవంతం చేయాలని జేసీ శ్రీనివాసులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోంపేట: పాఠశాలల్లో చేపడుతున్న నాడు-నేడు పనులను వేగవంతం చేయాలని జేసీ శ్రీనివాసులు తెలిపారు. సోంపేట ఏపీ మోడల్‌ స్కూల్‌, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జరుగు తున్న నాడు-నేడు పనులను ఆయన గురువారం పరిశీలించారు. పనుల తీరును ఎంఈవో ఎస్‌.జోరాడును అడిగితెలుసుకున్నారు. అనంతరం పలాసపురం సచివాలయాన్ని సంద ర్శించారు. ప్రభుత్వ పథకాలు పొందిన వారి జాబితాలను ప్రదర్శించాలని సిబ్బందికి సూచించారు.  కార్యక్రమంలో తహసీల్దార్‌ సదాశివుని గురుప్రసాద్‌,ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి, పంచాయితీ కార్యదర్శి వాసు, ప్రిన్సిపాల్‌ రజనీకుమారి, కవితా సాహు, అధ్యాపకులు పాల్గొన్నారు.

కంచిలి: స్థానిక మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులతో పాటు కంచిలి సచివాలయం-2ను జేసీ శ్రీని వాసులు గురువారం పరిశీలించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి తహసీల్దార్‌ ఆర్‌.వెంకటేష్‌, మండల ప్రత్యేకాదికారి ఆర్‌.వరప్రసాద్‌, ఎంపీడీవో వెంకటరావు,ఎంఈవో శివరాంప్రసాద్‌ పాల్గొన్నారు.

ఇచ్ఛాపురం:  పురుషోత్తపురం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనులను మున్సిపల్‌ కమిషనర్‌ లాలం రామలక్ష్మి గురవారం పరిశీలించారు. ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చే యాలని హెచ్‌ఎంలు, ఇంజనీర్లను ఆదేశించారు. 


Updated Date - 2020-11-13T05:47:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising