ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పరిశుభ్రతతోనే కరోనా నియంత్రణ’

ABN, First Publish Date - 2020-03-31T10:27:40+05:30

పరిశుభ్రత, స్వీయ నియంత్రణతోనే కరో నాని పారదోలవచ్చునని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత అన్నారు. సోమ వారం ఆమె విలేకరులతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), మార్చి 30: పరిశుభ్రత, స్వీయ నియంత్రణతోనే కరో నాని పారదోలవచ్చునని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత అన్నారు. సోమ వారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రజలంతా అప్రమత్తంగా ఉండి భౌతిక దూరం పాటించాలని, రోడ్లపై తిరగవద్దని సూచించారు. ఇంటికి కావాల్సిన అన్ని వస్తువులను ఒకేసారి కొనుగోలు చేసుకోవడం ఉత్తమమని చెప్పారు. గుంపులు గా తిరగవద్దని అన్నారు. జిల్లాలో క్వారంటైన్‌లో ఉన్న ఏడుగురికి నెగిటివ్‌ వచ్చి నందున ఇళ్లకు పంపిస్తున్నట్లు తెలిపారు. విదేశాలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన, కరోనా లక్షణాలు ఉన్న వారి వివరాలు తెలిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలన్నారు.


ప్రజలకు సేవలందించేందుకు జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ ముందుంటుందని చెప్పారు. జూడిషియల్‌ సిబ్బందికి శానిటైజర్ల తయారీ విధానాన్ని నేర్పించినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 104 ద్వారా సేవలు పొందవచ్చన్నారు. డీఎంహెచ్‌వో చెంచయ్య మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పారి శుధ్య పనులు ముమ్మరంగా చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. వారి వెంట జిల్లా న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి కె.జయలక్ష్మి తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా జడ్జి బబిత ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన రైతు బజార్‌ను పరిశీలించారు. అక్కడ ఉన్న అధికారులతో పలు విషయాలపై మాట్లాడారు.

Updated Date - 2020-03-31T10:27:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising