ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిల్లుల లొల్లి!

ABN, First Publish Date - 2020-12-16T05:25:58+05:30

కరోనా వేళ.. రెవెన్యూ శాఖలో బిల్లుల లొల్లి చర్చనీయాంశమవుతోంది. కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా పునరావాస(రిలీఫ్‌) కేంద్రాలకు మంజూరైన నిధుల విషయమై అధికారుల మధ్య రగడకు దారి తీస్తోంది. సంతబొమ్మాళి మండలంలో పునరావాస కేంద్రాలకు ఇటీవల ‘కరోనా’ నిధులు మంజూరయ్యాయి. వీటిని తహసీల్దార్‌ డ్రా చేసుకుని.. తమకు బిల్లులు చెల్లించడం లేదంటూ ఇద్దరు రెవెన్యూ అధికారులు ఆరోపిస్తున్నారు. ప్రతిసారీ పాత ఖర్చులే చూపించి.. బిల్లులు చెల్లించాలంటే కుదరదని తహసీల్దార్‌ స్పష్టం చేశారు. ఇది రెవెన్యూ శాఖలో అధికారుల మధ్య వివాదాలకు దారి తీస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- రెవెన్యూ శాఖలో ‘కరోనా’ రగడ 

- పునరావాస కేంద్రాల్లో నిధుల వినియోగంపై అధికారుల మధ్య వాగ్వాదం!

- తహసీల్దార్‌ వినియోగించారని ధ్వజం                                                          

(సంతబొమ్మాళి)

కరోనా వేళ.. రెవెన్యూ శాఖలో బిల్లుల లొల్లి చర్చనీయాంశమవుతోంది. కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా పునరావాస(రిలీఫ్‌) కేంద్రాలకు మంజూరైన నిధుల విషయమై అధికారుల మధ్య రగడకు దారి తీస్తోంది. సంతబొమ్మాళి మండలంలో పునరావాస కేంద్రాలకు ఇటీవల ‘కరోనా’ నిధులు మంజూరయ్యాయి. వీటిని తహసీల్దార్‌ డ్రా చేసుకుని.. తమకు బిల్లులు చెల్లించడం లేదంటూ ఇద్దరు రెవెన్యూ అధికారులు ఆరోపిస్తున్నారు. ప్రతిసారీ పాత ఖర్చులే చూపించి.. బిల్లులు చెల్లించాలంటే కుదరదని తహసీల్దార్‌ స్పష్టం చేశారు. ఇది రెవెన్యూ శాఖలో అధికారుల మధ్య   వివాదాలకు దారి తీస్తోంది. 

-------------------------------

‘కరోనా’ నిధుల మంజూరు విషయమై రెవెన్యూ శాఖలో వివాదం రేగుతోంది. లాక్‌డౌన్‌ సమయంలో చాలామంది వలస కూలీలు జిల్లాకు చేరుకున్నారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా వారంతా 14 రోజుల నుంచి నెల రోజుల వరకూ ‘క్వారంటైన్‌’లో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పునరావాస(రిలీఫ్‌) కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో సంతబొమ్మాళి మండలంలో సంతబొమ్మాళి, బోరుభద్ర, నౌపడ, గోవిందపురం గ్రామాల్లో రెవెన్యూ అధికారులు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కూలీలకు భోజనంతో పాటు మౌలిక వసతులు కల్పించారు. గ్రామ స్థాయి నాయకుల సహకారంతో కొంతమేర భోజన వసతి ఏర్పాట్లు చేశారు. ఈ కేంద్రాల నిర్వహణ బిల్లుల బకాయిలకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల రూ.13లక్షలు విడుదల చేసింది. ఈ నిధుల మంజూరు వ్యవహారంలో తహసీల్దార్‌, ఇద్దరు రెవెన్యూ అధికారుల మధ్య రగడ నెలకొన్నట్టు తెలిసింది. మండలంలోని నాలుగు పునరావాస కేంద్రాల్లో తాము ఖర్చు చేసిన బిల్లులను మంజూరు చేయాలని రెవెన్యూ అధికారులు తహసీల్దార్‌ను అడగ్గా.. వాటిని డ్రా చేయలేదని ఆయన సమాధానమిచ్చారు. అయితే తహసీల్దార్‌.. కరోనా నిధులను డ్రా చేసి.. తమకు మంజూరు చేయడం లేదంటూ ఆ ఇద్దరు రెవెన్యూ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వారిద్దరూ తహసీల్దార్‌ను కార్యాలయంలో నిలదీశారనే చర్చ రెవెన్యూ వర్గాల్లో సాగుతోంది. ఇప్పటికే కొన్ని బిల్లులు చెల్లించానని.. మిగతా బిల్లులు నిధులు వస్తే చెల్లిస్తానని తహసీల్దార్‌ వారికి చెప్పినట్టు తెలుస్తోంది. ప్రతిసారీ తప్పుడు బిల్లులు పెట్టి.. ఎన్నిసార్లు నిధులు డ్రా చేసుకుంటారని వారిపై తహసీల్దార్‌ ఎదురు తిరిగినట్టు చర్చించుకుంటున్నారు. మరోవైపు ఈ నాలుగు పునరావాస కేంద్రాల్లోనూ తప్పుడు బిల్లులు పెట్టి.. లక్షలాది రూపాయల నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలామంది పునరావాస కేంద్రాలకు ఏర్పాటు చేసిన టెంట్‌ హౌస్‌, మైక్‌ళల బిల్లు చెల్లించాలని తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. అలాంటిది అధికారులు తమ వాటాల కోసం వాగ్వాదాలు చేసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నాలుగు కేంద్రాలకు మంజూరు చేసిన నిధుల వినియోగంపై ఉన్నతాధికారులు విచారణ చేపడితే.. మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. 


కలెక్టర్‌ దృష్టికి తీసుకెళతా


పునరావాస కేంద్రాలకు సంబంధించి కొన్ని బిల్లులు చెల్లించాం. నిధులు వస్తే మిగిలిన మొత్తం చెల్లిస్తాం. గతంలో ఆ ఇద్దరు అధికారులు ఖర్చు చేశామని చెప్పి.. తీసుకున్న డబ్బులకు ఇంతవరకు ఎటువంటి రశీదులు ఇవ్వలేదు. ప్రతిసారీ పాతఖర్చులే చూపించి మళ్లీ మళ్లీ బిల్లులు చెల్లించాలని కోరుతున్నారు. దీనికి సంబంధించి అన్ని వివరాలు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తాను.

-ఎస్‌.రాంబాబు, తహసీల్దార్‌, సంతబొమ్మాళి

Updated Date - 2020-12-16T05:25:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising