ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించండి

ABN, First Publish Date - 2020-03-16T09:44:27+05:30

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రిను పూర్తిగా రద్దు చేసి కేంద్ర బలగాల ఆధ్వర్యంలో మరలా నిర్వహించాలని టీడీపీ రాష్ట్ర అధ్య క్షుడు కిమిడి కళా వెంకటరావు డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

72 ఏళ్లలో ఇంత అరాచకం ఎప్పుడూ లేదు  ఎన్నికల కమిషన్‌పై అనుచిత వ్యాఖ్యలు తగవు  టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకటరావు


పాలకొండ/రాజాం, మార్చి 15: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రిను పూర్తిగా రద్దు చేసి కేంద్ర బలగాల ఆధ్వర్యంలో మరలా నిర్వహించాలని టీడీపీ రాష్ట్ర అధ్య క్షుడు కిమిడి కళా వెంకటరావు డిమాండ్‌ చేశారు. ఆది వారం పాలకొండ, రాజాంలలో ఆయన విలేకరులతో మా ట్లాడుతూ.. ‘స్థానిక’ ఎన్నికల్లో భాగంగా అధికార వైసీపీ అనేక అరాచకాలకు పాల్పడిం దని విమర్శించారు. జగన్మో హన్‌రెడ్డి హయాంలో జరిగిన రీతిలో అరాచకాలు గత 72 ఏళ్లుగా దేశంలో ఎక్కడా కూడా జరగలేదన్నారు. రా ష్ట్రంలో రాజ్యాంగాన్ని అణగదొక్కి, పోలీస్‌  తదితర వ్యవ స్థలను తన గుప్పెట్లో పెట్టుకుని అభ్యర్థులను భయభ్రాం తులకు గురి చేసి రౌడీయిజంతో ఎన్నికలు  చేయించుకో వాలని భావించారన్నారు.


అయితే ప్రజాస్వామ్యం ఉన్న ది అనేది ఎన్నికలు వాయిదా వేసేందుకు ఒక నిదర్శన మన్నారు. ప్రభుత్వ వ్యవహార శైలి, నిర్వాకం, పోలీసులతో చేయించిన  జులుం తదితర కారణాలే ఎన్నికల వాయి దాకు కారణమని అభిప్రాయపడ్డారు.  రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై సీఎం అనుచిత వ్యాఖ్యలు చేయడం తగవ న్నారు. వీటిని సభ్యసమాజం ఖండాల్సిన అవసరం ఎం తైనా ఉందన్నారు. పులివెందుల రాజకీయాలు చేసి ప్రజ లను, అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు.


దుర్మార్గాలతో ఎన్నికలను ఏకగ్రీవం చేసు కునేందుకు ప్రయత్నించారన్నారు. అయినప్పటికీ 93 శాతం టీడీపీ కార్యకర్తలు, నాయకులు నామినేషన్లు వేశారంటే ఇది చాలా గ్రేట్‌ అని, టీడీపీని, కార్యకర్తలను సైని కుల్లా తయారు చేసిన ఘనత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దేనన్నారు.


కార్యకర్తల్లో మనో ధైర్యాన్ని కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుం దన్నారు. న్యాయ స్థానాన్ని ఆశ్రయించి అయినా సీఆర్‌పీఎఫ్‌ బలగాలను విని యోగించి ప్రజలు స్వేచ్ఛగా ఓట్లు వేసే లా చర్య లు తీసుకోవాలన్నారు. జగన్‌ రాక్షస పాలనను ప్రజలు గమని స్తున్నారన్నారు. భవిష్యత్‌లో ప్రజా ఉద్యమం తప్పదని, తుపాకులు పట్టుకొని తిరిగిన బ్రిటిష్‌ వారే ప్రజా వ్యతిరేకతకు మట్టికరిచారని, జగన్‌ ఎంత అని ఎద్దేవా చేశారు. ఆయనతో పాటు నాయకులు కర్నేన అప్పలనాయుడు,  యోగిత తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-16T09:44:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising