ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమగ్రంగా ఇంటింటా సర్వే

ABN, First Publish Date - 2020-04-09T11:59:44+05:30

ఇంటింటా సమగ్రంగా సర్వే నిర్వ హించాలని కలెక్టర్‌ జె.నివాస్‌ ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వలంటీర్లు, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి 

నిర్లక్ష్యం వద్దు 

కలెక్టర్‌ నివాస్‌ ఆదేశం


నరసన్నపేట/పోలాకి, ఏప్రిల్‌ 8: ఇంటింటా సమగ్రంగా సర్వే నిర్వ హించాలని కలెక్టర్‌  జె.నివాస్‌ ఆదేశించారు. ఇతర ప్రాంతాల నుంచి గ్రామాలకు వచ్చిన వారి వివరాలను నమోదుచేయడంలో నిర్లక్ష్యంచేయవద్దని తెలిపారు. బుధవారం తామరాపల్లి, జమ్ముల్లో కోవిడ్‌-19 సర్వేను  పరిశీలిం చారు. ఈనెల 19వ తేదీకి ముందు విశాఖపట్నం నుంచి వచ్చిన వారిని గుర్తించి ఎందుకు  వివరాలను అందజేయలేదని వలంటీర్లను ప్రశ్నించారు.ప్రతి 50 కుటుంబాల  సమగ్ర వివరాలను అందజేయా లని తెలిపారు.ఈ విషయంలో వైద్యఆరోగ్యశాఖ, వలంటీర్లు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.  ఇతర ప్రాంతాల  నుంచి వచ్చిన వారికి 28 రోజులు హోం క్వారంటైన్‌లో ఉంచాలని తెలిపారు.


తామరాపల్లి రెసిడెన్షి యల్‌ పాఠశాలలో గల ఐసోలేషన్‌ కేంద్రాన్ని పరిశీలించా రు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికా రి  ఆర్‌వీ రామన్‌,  ఎంపీడీవో రోణంకి వెంకట్రావు, తహసీల్దార్‌ కె.ప్రవల్లిక ప్రియ, ఈవోఆర్‌డీ రవికుమార్‌, మాకివలస పీహెచ్‌సీ వైద్యుడు బలగ మురళీ  పాల్గొన్నారు. అలాగే పోలాకి మండలంలోని ఈదులవలస, దీర్గాశిల్లో మూడోవిడత గ్రామ వలంటీర్లు  చేపడుతున్న సర్వే పరిశీలించారు.  మండల ప్రత్యేకాధికారి వెంటకరావు, తహసీల్దార్‌ ఎ.సింహాచలం, వైద్యాధికారి బండారు అప్పలనాయుడు, పం చాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-09T11:59:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising