ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి పూర్తి లాక్‌డౌన్‌

ABN, First Publish Date - 2020-07-19T12:05:55+05:30

నరసన్నపేటలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న దృ ష్ట్యా ఆదివారం నుంచి పట్టణంలో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జేసీ శ్రీనివాసులు


నరసన్నపేట, జూలై 18: నరసన్నపేటలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న దృ ష్ట్యా ఆదివారం నుంచి పట్టణంలో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ అమలుచేస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం స్థానిక పం చాయతీ కార్యాలయ ఆవరణలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆదివారం నుంచి 14 రోజుల పాటు కేవలం నిత్యావసర సరకులు, కూరగాయలు, మందులు దుకాణాలకు మాత్రమే అనుమతించాలన్నారు. మిగిలిన దుకాణాలు తెరిచేందుకు అవకాశం లేదని, ఈ దిశలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే నిత్యావసర సరుకుల దుకాణాలు తెరవాల్సి ఉంటుందన్నారు. నిబంధనలు పాటించకుంటే చర్యలు చేపట్టాలని సూచించారు. అత్యవసనమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రాకూడదన్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. సమావేశంలో ఆర్డీవో ఎంవీ  రమణ, మండల ప్రత్యేకాధికారి ఆర్వీ రామన్‌, ఎంపీడీవో వెంకటరావు, తహసీల్దార్‌ ప్రవల్లిక ప్రియ, సీఐ తిరుపతిరావు, ఈవోపీఆర్డీ రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-19T12:05:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising