ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా సమాచారాన్ని అందించండి

ABN, First Publish Date - 2020-06-23T10:06:03+05:30

కరోనా కేసుల సమాచారాన్ని అందించాలని రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్లకు కలెక్టర్‌ నివాస్‌ ఆదేశించారు. జడ్పీ సమా వేశ మందిరంలో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్‌ఎంపీలకు కలెక్టర్‌ నివాస్‌ ఆదేశం


శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, జూన్‌ 22 : కరోనా కేసుల సమాచారాన్ని అందించాలని రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్లకు కలెక్టర్‌ నివాస్‌ ఆదేశించారు. జడ్పీ సమా వేశ మందిరంలో సోమవారం ఆర్‌ఎంపీ వైద్యులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఇది కీలక సమయమన్నారు. ఇప్పుడే సామాజిక వ్యాప్తి ప్రా రంభమైందన్నారు.అందరూ బాధ్యతగా వ్యవహరించా లని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో కీలకంగా ఉండే ఆర్‌ఎంపీలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలన్నా రు.


అధికార యంత్రాంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రజలు ఆర్‌ఎంపీలనే ఆశ్రయిస్తారని.. అనుమానిత లక్షణాలుంటే వెంటనే అధికారులకు సమా చారం అందించాలని కోరారు.ప్రత్యేక యాప్‌ను రూపొం దించామన్నారు. ఎప్పటికప్పుడు వివరాలను నమోదుచే యాలని సూచించారు. మాస్కులు ధరించకుంటే క్వారం టైన్‌ కేంద్రాలకు తరలిస్తామని కలెక్టర్‌ హెచ్చరించారు. కార్యక్రమంలో జేసీ శ్రీనివాసులు, డీఎంహెచ్‌ఓ చెంచ య్య, అదనపు డీఎంహెచ్‌ఓ జగన్నాథరావు పాల్గొన్నారు. 


నాణ్యత పాటించండి

పాలకొండ, జూన్‌ 22: పాఠశాలల్లో చేపడుతున్న నాడు-నేడు పనులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని కలెక్టర్‌ జె.నివాస్‌ కోరారు. ఆదివారం అన్నవరం, అంపిలిల్లో నాడు -నేడు పనులను పరిశీలించారు. కాగా పాలకొండలో ఓ కాలనీలో  కంటోన్మెంట్‌ జోన్‌గా ప్రకటించడంతో కలెక్టర్‌ నివాస్‌ పరిశీలించారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్‌ ధరించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో టీవీఎస్‌జీ కుమార్‌, నగరపంచాయతీ కమీషనర్‌ లిల్లీపుష్పనాధం  పాల్గొన్నారు. 


రక్తదానం చేయండి

కలెక్టరేట్‌, జూన్‌ 22: రక్తదానానికి యువత ముందుకురావాలని కలెక్టర్‌ నివాస్‌ పిలుపునిచ్చారు. సోమవారం రామ్‌చరణ్‌ యువశక్తి ఆధ్వర్యంలో రెడ్‌క్రాస్‌ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ నివాస్‌ శిబిరాన్ని ప్రారంభించారు.కలెక్టర్‌ మాట్లాడుతూ కరోనా ఉధృతి సమయంలో జిల్లాలో రక్తనిల్వలు నిండుకున్నాయని చెప్పారు. ఇటువంటి తరుణంలో రక్తదానం చేయడానికి ముందుకొచ్చిన యువతను అభినందించారు.అనంతరం రక్తదాతలకు సర్టిఫికెట్లను అందజేశారు. రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ పి.జగన్మోహనరావు , మండవిల్లి రవి, పెంకి చైతన్య, రామ్‌చరణ్‌ యువశక్తి ప్రతినిధులు తైక్వాండో గౌతమ్‌, న్యూట్రీషనిష్ట్‌ నాగరాజు,తైక్వాండో శ్రీను, రవణం స్వామినాయుడు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-23T10:06:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising