ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మట్టి మనిషి ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-08-13T08:44:01+05:30

మట్టిని నమ్ముకున్న రైతు మట్టిలో కలిసిపోయాడు. అర్ధాంతరంగా నిండు జీవితం ముగిసిపోయింది. ఆయనకు నాలుగెకరాల సొంత భూమి ఉంది. ఏటా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అప్పులతో పురుగుల మందు తాగిన రైతు 


ఆదోని, ఆగస్టు 12: మట్టిని నమ్ముకున్న రైతు మట్టిలో కలిసిపోయాడు. అర్ధాంతరంగా నిండు జీవితం ముగిసిపోయింది. ఆయనకు నాలుగెకరాల సొంత భూమి ఉంది. ఏటా వ్యవసాయం చేసి అప్పులపాలయ్యాడు. వడ్డీల రూపంలో పెరిగిపోతున్న అప్పులు ఆయన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశాయి. అప్పులు చెల్లించలేని దుస్థితిలో జీవించలేకపోయాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పత్తికొండ మండలం నలకదొడ్డి గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. బత్తిన హనుమంతు(46)కు 4 ఎకరాల పొలం ఉంది.


పొలం సాగు చేసుకుంటూ మిగతా సమయంలో కూలి పని చేసేవాడు. కష్టం మీద ఆధారపడి ఇద్దరు కూతుళ్లను బీఎస్‌ఈ చదివిస్తున్నాడు. కానీ ఐదేళ్లుగా వ్యవసాయం కలిసి రావడం లేదు. ఏటా అప్పులే. ఒకసారి వర్షాలు లేక, మరోసారి భారీ వర్షాలు కురిసి పంటలు దెబ్బతిన్నాయి. చేతికి వచ్చిన పంటకు గిట్టుబాటు ధరలు అందలేదు. మొత్తం మీద పెట్టుబడి, శ్రమ అంతా మట్టిపాలైంది. ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాది అయినా లాభాలు రావా? అని ఆశతో వ్యవసాయం చేస్తూ వచ్చాడు. అప్పులు పెరిగాయేగాని పంటలు చేతికి రాలేదు. గత ఐదేళ్లుగా వడ్డీలకు వడ్డీలు కలుపుకొని దాదాపు రూ.5 లక్షలకు పైగా అప్పులు మిగిలాయి. గ్రామంలో ఇంతకాలం బాగా బతికిన తాము అప్పులు తీర్చలేకపోవడంతో ముఖం చూపించలేని పరిస్థితి వచ్చిందని హనుమంతు ఆవేదన చెందేవాడు.


ఎక్కడికైనా వెళ్లి కూలి పనులు చేసుకొని బతుకుదామని భార్య రాధమ్మ చెబుతుండేది. కానీ హనుమంతు ధైర్యం పొందలేదు. మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి వాంతులు చేసుకుంటుండగా గుర్తించామని రాధమ్మ చెప్పింది. ఆదోని ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు చికిత్స ప్రారంభించేలోగానే మృతి చెందాడు. ఇంటికి పెద్దదిక్కును కోల్పోయి ఎలా బతకాలని, చేసిన అప్పులు ఎలా తీర్చాలని ఆమె విలపిస్తున్న తీరు పలువురిని కంటతడిపెట్టించింది. రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. రాధమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని హెడ్‌కానిస్టేబుల్‌ శంకర్‌రెడ్డి తెలిపారు. పోస్టుమార్టం అనంతరం రైతు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

Updated Date - 2020-08-13T08:44:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising