పరీక్ష కేంద్రంలో సెల్‌ఫోన్ల చోరీ
ABN, First Publish Date - 2020-03-16T09:52:36+05:30
నగరంలోని ఆర్ట్స్ కళాశాల రోడ్డులో ఉన్న ఓ కళాశాలలో డిగ్రీ చివరి ఏడాది పరీక్షలు రాసేందుకు వెళ్లిన పలువురి
శ్రీకాకుళం క్రైం, మార్చి 15: నగరంలోని ఆర్ట్స్ కళాశాల రోడ్డులో ఉన్న ఓ కళాశాలలో డిగ్రీ చివరి ఏడాది పరీక్షలు రాసేందుకు వెళ్లిన పలువురి విద్యార్థుల సెల్‌ఫోన్లు చోరీకి గురయ్యాయి. బాధిత విద్యార్థులు తెలిపిన వివరాలు ప్రకారం.. డిగ్రీ పరీక్ష రాసేందుకు పరీక్షా కేంద్రానికి వెళ్లే సందర్భంలో ఒకే గ్రామానికి చెందిన ఏడుగురు విద్యార్థులు తమ సెల్‌ఫోన్లను బ్యాగులో పెట్టి కళాశాల ఆవరణలో బ్యాగును ఉంచారు. ఈ క్రమంలో విద్యార్థులు పరీక్ష రాసి తిరిగి తమ బ్యాగును తీసుకునేందుకు వెళ్లేసరికి ఆ బ్యాగు కనిపించలేదు. కళాశాల మొత్తం వెతికిన విద్యా ర్థులు ఆదివారం రెండో పట్టణ పోలీసులకు సెల్‌ఫోన్ల చోరీపై ఫిర్యాదు చేశారు. ఈ ఏడు సెల్‌ఫోన్లు సుమారు రూ.లక్ష విలువ చేస్తాయని విద్యార్థులు పేర్కొంటు న్నారు. అయితే కళాశాల ఆవరణలో ఎటువంటి సీసీ కెమెరాలు లేకపోవడంతో బ్యాగు ఎవరు తీసుకెళ్లారో అన్న విషయంపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
Updated Date - 2020-03-16T09:52:36+05:30 IST