గిరిజనుల ఆర్థికాభివృద్ధే ధ్యేయం
ABN, First Publish Date - 2020-11-04T05:18:48+05:30
గిరిజనుల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వం ధ్యేయమని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు.
స్పీకర్ తమ్మినేని సీతారాం
పాలకొండ/బూర్జ: గిరిజనుల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వం ధ్యేయమని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. మంగళవారం బూర్జ మండలంలోని వైకుంఠపురంలో సీసీరోడ్లను ప్రారంభించారు. అనంతరం గిరిజనులకు సాగు హక్కు పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులు భూములపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపా రు. దీని దృష్టిలో పెట్టుకొని రెండెకరాల భూ మిని ప్రభుత్వం సాగు హక్కుగా కల్పించి అన్ని రాయితీలు పొందేలా చర్యలు తీసుకుంటుందని చెప్పారు.ఐటీడీఏ పరిధిలో 22 గిరిజన లబ్ధిదారులకు 32 వేల ఎకరాల భూపట్టాల పంపిణీ చేసినట్లు తెలిపారు.గిరిజన గ్రామాలకు రూ.ఆరు కోట్లతో రహదారి సౌకర్యం కల్పిస్తామ ని, సోలార్ ద్వారా తాగునీరం దిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో సీహెచ్ శ్రీధర్ పాల్గొన్నారు.
Updated Date - 2020-11-04T05:18:48+05:30 IST