ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘జీడి రైతులకు తీరని అన్యాయం’

ABN, First Publish Date - 2020-08-08T09:02:08+05:30

జీడి రైతులకు ప్రభుత్వం, వ్యాపారులు తీరని అన్యాయం చేశారని వామపక్ష నాయకులు ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాశీబుగ్గ, ఆగస్టు 7 : జీడి రైతులకు ప్రభుత్వం, వ్యాపారులు తీరని అన్యాయం చేశారని వామపక్ష నాయకులు ఆరోపించారు. శుక్రవారం కాశీ బుగ్గ సీపీఐ కార్యాలయంలో వామపక్షాల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతేడాది రూ.13వేలు గిట్టుబాటు ధర ఉండగా... ఈ ఏడాది కలెక్టర్‌, మంత్రి కలిసి గిట్టుబాటు ధర రూ. 10వేలకు కుదించడం దారుణమన్నారు. ఇందులో రూ.9వేలు  వ్యాపారి ఇస్తే... మిగిలిన రూ.వెయ్యి ప్రభుత్వం చెల్లిస్తుందనడం హాస్యాస్పదంగా ఉ న్నారు. ఈ పద్ధతి  వ్యాపారులకు లాభం చేకూర్చేందుకేనని  ఆరోపిం చారు. జీడి రైతులకు న్యాయం చేస్తారనుకుంటే తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వెలిబుచ్చారు. జీడి రైతులకు న్యాయం జరిగేవరకు దీర్ఘకాలిక పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.  సమావేశంలో వామపక్ష నాయకులు చాపర వేణుగోపాల్‌, వెంకటరమణ, మాధవరావు, కుసుమ, వినోద్‌, గణపతి, ఎం.రామారావు ఉన్నారు.


జీడి కార్మికులకు ఉపాధి కల్పించండి 

పలాస రూరల్‌: జీడి పరిశ్రమలను తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలని క్యాష్యూ లేబర్‌, రైస్‌మిల్లర్స్‌ కార్మిక సంఘ నాయకులు డి మాండ్‌ చేశారు.  ఈమేరకు శుక్రవారం  రెవెన్యూ కార్యాలయంలో సంఫ నాయకులు  వినతి పత్రాన్ని  తహసీల్దార్‌ మధుసూధనరావుకు అందజేశారు. వినతిపత్రం అందించిన వారిలో సంఘ అధ్యక్షుడు బొంపల్లి సింహాచలం, ప్రధాన కార్యదర్శి అంబటి కృష్ణమూర్తి, సభ్యులు కోనారి రాము, ఆదినారాయణ పాల్గొన్నారు

Updated Date - 2020-08-08T09:02:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising