ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి
ABN, First Publish Date - 2020-06-18T11:16:11+05:30
కరోనా పాజిటివ్ కేసులు నమోదైన గ్రామాలను కంటైన్‌మెంట్ జోన్‌లుగా ప్రకటించిన అధికారులు ఆయా గ్రామాల్లో పర్యటించి కరోనా నియంత్రణలో
నరసన్నపేట, జూన్ 17: కరోనా పాజిటివ్ కేసులు నమోదైన గ్రామాలను కంటైన్‌మెంట్ జోన్‌లుగా ప్రకటించిన అధికారులు ఆయా గ్రామాల్లో పర్యటించి కరోనా నియంత్రణలో అప్రమత్తంగా ఉండాలని, ఇంటి నుంచి ఎవరూ బయటకు రావద్దని సూచించారు. బుధవారం ఆదివారంపేట, సత్యవరం, కంబకాయి గ్రామాల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు.
గ్రామాల్లో వలంటీర్ల ద్వారా సరుకులను ఇంటింటికీ అందించే ఏర్పాట్లు చేస్తున్నామని ప్రత్యేకాధికారి ఆర్వీ రామన్ తెలిపారు. తహసీల్దార్ కార్యాల యంలో పంచాయతీ, రెవెన్యూ, కోవిడ్ అధికారులు, మహిళ పోలీసులతో సమీక్ష సమావేశం నిర్వహించి కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. సమావేశంలో తహసీల్దార్ కె.ప్రవల్లిక ప్రియ, ఎంపీడీవో రోణంకి వెంకట్రావు, మాకివలస వైద్యాధికారులు బలగ మురళి, మాతల ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-06-18T11:16:11+05:30 IST