ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉసురు తీసుకున్నారు

ABN, First Publish Date - 2020-11-03T05:54:07+05:30

జిల్లాలో వేర్వేరు చోట్ల ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇచ్ఛాపురం, పొందూరులలో ఇద్దరు మహిళలు, రేగిడిలో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో ఆయా గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఢిల్లేశ్వరి (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 వేర్వేరు చోట్ల ముగ్గురి ఆత్మహత్య 

 ఆయా గ్రామాల్లో విషాదం

జిల్లాలో వేర్వేరు చోట్ల ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇచ్ఛాపురం, పొందూరులలో ఇద్దరు  మహిళలు, రేగిడిలో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో ఆయా గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 కొఠారిలో వివాహిత..

ఇచ్ఛాపురంరూరల్‌, నవంబరు 2:

కొఠారి గ్రా మంలో ఆదివారం అర్ధరాత్రి  వాకాడ ఢిల్లేశ్వరి (32) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఈదు పురం గ్రామానికి చెందిన  ఢిల్లేశ్వరికి కొఠారి గ్రామానికి చెందిన పాపారావుతో 2007లో వివాహం జరిగింది. పాపా రావు ఆర్మీ ఉద్యోగిగా రెండు నెలల కిందటే పదవీవిరమణ పొందాడు. ఇంటి వద్దే ఉంటున్నాడు. వీరికి లక్కి (6), లావణ్య (4) అనే ఇద్దరు కుమా ర్తెలు ఉన్నారు. ఆదివారం రాత్రి దంపతుల మధ్య చిన్నపాటి వివాదం చోటుచేసుకుంది. ఢిల్లేశ్వరి సోదరుడు శంకర్‌ సర్ధిచెప్పి ఈదుపు రం వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఢిల్లేశ్వరి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు భర్త పాపారావు ఈదుపురంలోని తండ్రి నూకయ్యకు ఫోన్‌ చేసి చెప్పాడు. దీంతో వారు హుటాహుటిన అక్కడకు చేరుకు న్నారు. తమ కుమార్తె మృతికి అల్లుడు పాపారావే కారణమంటూ ఆరోపిస్తూ పోలీ సులకు ఫిర్యాదుచేశారు. అనుమానంతో నిత్యం మానసికంగా, శారీరకంగా వేధించే వాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. సోమవారం ఉదయం రూరల్‌ ఎస్‌ఐ లక్ష్మి సిబ్బం దితో ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ  ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు. తల్లి మరణంతో పిల్లలు బిక్కుబిక్కుమంటూ ఉండడం అక్కడున్న వారిని కలచివేసింది.

 

పెళ్లయిన మూడు నెలలకే..

పొందూరు: దళ్లిపేటలో దళ్లి ధనలక్ష్మి (20) అనే వివాహిత ఆత్యహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం మేరకు.. దళ్లిపేటకు చెందిన దళ్లి జగన్‌తో  కొయ్యాం గ్రామానికి చెందిన ధనలక్ష్మికి మూడు నెలల కిందట వివాహం జరిగింది. భార్యపై అనుమానంతో నిత్యం వేధించడంతో విసుగుచెందిన ధనలక్ష్మి ఆదివారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ధనలక్ష్మి తల్లిదండ్రులు దుర్గమ్మ లక్ష్మణరావు పోలీసులకు జగన్‌పై ఫిర్యాదుచేశారు. దీనిపై ఎస్‌ఐ దేవానంద్‌ కేసు నమోదు చేశారు. సీఐ చంద్రశేఖరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

ఉంగరాడమెట్ట వద్ద ఒకరు..

రేగిడి: వీరఘట్టం మండలం తలవరం గ్రామానికి చెందిన బెవర భాస్కరరావు (39) ఉంగరాడ మెట్ట సమీపంలోని ఓ తోటలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం అటువైపుగా వెళ్లిన స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. ఎస్‌ఐ షేక్‌ మహ్మద్‌ ఆలీ సిబ్బందితో  అక్కడకు చేరుకున్నారు. భాస్కరరావు మృతదేహంగా గుర్తించి కుటుం బసభ్యులకు సమాచారమందించారు. భాస్కరరావు వలస కూలీ. విజయవాడలో పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్‌తో ఇంటి వద్దే ఉంటున్నాడు. మద్యానికి బానిసయ్యాడు. విజయవాడలో ఉన్న కుమారుడ్ని తీసుకొస్తానని చెప్పి వారం రోజుల కిందట  ఇంటి నుంచి బయలుదేరాడు. అప్పటి నుంచి ఆయన ఆచూకీ లేదు. ఇంతలో ఉంగరాడ మెట్టలో ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలియడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతుడికి భార్య గౌరీశ్వరి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.  మృతదేహం వద్ద కన్నీరుమున్నీరవుతున్నారు. వారం రోజుల కిందట ఇంటి నుంచి బయలుదేరిన భాస్కరరావు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నాడు? ఉంగరాడమెట్ట ఎలా వచ్చాడు అన్నదానిపై సమగ్ర దర్యాప్తు చేయనున్నట్టు ఎస్‌ఐ షేక్‌ మహ్మద్‌ అలీ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఆస్పత్రికి తరలించారు.  

 

Updated Date - 2020-11-03T05:54:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising